గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీకి వింత అనుభవం: మొరాయించిన ఈవీఎంలు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి వింత అనుభవం ఎదురైంది. ఓటు వేయడానికి వెళ్లగా..అక్కడి ఈవీఎం మొరాయించింది. సుమారు 20 నిమిషాల పాటు ఈవీఎం పని చేయలేదు. దీనితో కంగారుపడ్డ పోలింగ్ సిబ్బంది..హుటాహుటిన దాన్ని సరిచేశారు. అనంతరం- ద్వివేదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని తాడేపల్లి మండలం క్రిస్టియన్ పేట మున్సిపల్ హైస్కూల్ లో 35వ పోలింగ్ కేంద్రానికి ఆయన ఓటు వేయడానికి వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఈవీఎంలు మొరాయించినట్లు తనకు సమాచారం అందిందని, వాటిని యుద్ధ ప్రాతిపదికన సరిచేయడానికి 300 మంది ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు ద్వివేదీ తెలిపారు. ఈ పరిణామంపై ద్వివేది అక్కడి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఈవీఎం మార్చాలని సిబ్బందిని సూచించారు.

దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణ దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణ

బీప్ సౌండ్ రావాట్లేదంటూ ఫిర్యాదులు

ఈవీఎంలు మొరాయించడం వల్ల పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మాక్ పోలింగ్ సమయంలో ఈవీఎంల పనితీరును పరిశీలించిన అనంతరం.. సాంకేతిక సిబ్బందికి సమాచారం ఇచ్చి, వాటిని సరిచేయించారు. కడప జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయనే సమచారం వస్తోంది. జమ్మలమడుగు, కమలాపురం, రాజంపేట నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. దీనితో పాటు శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగా పనిచెయ్యట్లేదని సమాచారం. ఈవీఎంపై బటన్ నొక్కగా బీప్ సౌండ్ రావట్లేదని ఫిర్యాదులు అందాయి. కొన్ని చోట్ల ఏజెంట్లకు ఈవీఎంలు, వీవీప్యాట్లపై పోలింగ్ సిబ్బంది అవగాహన కలిగిస్తున్నారు.

State Chief Election Officer unable to vote in Tadepalli due to malfunctioning EVMs

పలు చోట్ల ఇదే పరిస్థితి..

ఆత్మకూరు, మడకశిర, ఉరవకొండ, నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి, శింగనమల, ఎర్రగొండ పాలెం, ప్రొద్దుటూరు, పెదకూరపాడు, వేమూరు, పర్చూరు, మంగళగిరి, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, ఏలూరు, రాజానగరం, కాకినాడ సిటీ, తుని, నూజివీడు, కైకలూరు, కొవ్వూరు, పామర్రు, చిలకలూరి పేట, కళ్యాణదుర్గం, దర్శి, తాడిపత్రి, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్.. వంటి నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయట్లేదంటూ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి.

English summary
Andhra Pradesh Chief Election Officer Gopala Krishna Dwivedi was unable to cast his vote at Tadepalli Assembly constituency in Guntur district due to malfunctioning EVMs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X