అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడు రాజధానులకే మొగ్గు..?, రైతుల పరిహారంపై చర్చ, సీఎం జగన్మోహన్ రెడ్డితో హై పవర్ కమిటీ

|
Google Oneindia TeluguNews

అభివృద్ధి వికేంద్రీకరణకే హై పవర్ కమిటీ మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ కన్సల్టెన్సీ నివేదికలను అధ్యయనం చేసిన కమిటీ.. ఇవాళ తొలిసారి సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. రాజధాని మార్పు గురించి సమగ్రంగా అధ్యయనం చేశామని, రాజధానుల మార్పునకే కమిటీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. కమిటీ పరిశీలించిన అంశాలు, ప్రతిపాదనలను సీఎం జగన్‌కు సీఎస్ నీలం సహానీ, హై పవర్ కమిటీ చైర్మన్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

పవర్‌పాయింట్ ప్రజంటేషన్

పవర్‌పాయింట్ ప్రజంటేషన్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో హై పవర్ కమిటీ సభ్యులు తాము అధ్యయనం చేసిన వివరాలను గంటపాటు వివరించారు. జీఎన్ రావు కమిటీ సూచనలు, బీసీజీ కమిటీ సిఫారసులను సమగ్రంగా పరిశీలించినట్టు కమిటీ మెంబర్స్ పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే అన్నిప్రాంతాలు డెవలప్ జరుగుతోందని భావిస్తున్నారు. రాజధాని తరలిస్తే పరిస్థితి ఏంటీ ? ఎలా ముందడుగు వేయాలి ? ప్రణాళికలను కూడా సీఎం జగన్‌కు వివరించినట్టు సమాచారం.

రైతులకు పరిహారమా..?

రైతులకు పరిహారమా..?

అమరావతి నుంచి విశాఖపట్టణానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మారితే.. అక్కడ ఉద్యోగులకు కల్పించే సౌకర్యాలపై ఆరా తీశారు. ఇటు అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల గురించి డిస్కస్ చేశారు. రైతులకు ఎలాంటి సాయం చేయాలి, వారిని సంతృప్తిపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఫోకస్ చేశారు. అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో కమిటీ సభ్యులైన మంత్రులు వారితో మాట్లాడామని, వారికి ఏం ఇవ్వాలనే అంశంపై రెండు, మూడు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

మూడు రీజియన్లుగా..

మూడు రీజియన్లుగా..


రాష్ట్రం సమతుల్య అభివృద్ధి కోసం సిఫారసులు రూపొందించినట్టు తెలుస్తోంది. రాయలసీమను ఒక రీజియన్‌గా తీసుకొని డెవలప్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనే అంశంపై చర్చించారు. దీంతోపాటు నెల్లూరు, ఒంగోలు, కృష్ణా, గుంటూరు ఒక ప్రాంతంగా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు మరో రీజియన్‌గా తీసుకొని అభివృద్ధి చేయాలని సిఫారసు చేసే అవకాశం ఉంది. వికేంద్రీకరణతో సత్వర, సమగ్రంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని హై పవర్ కమిటీ భావిస్తోంది.

మూడు రాజధానులు...

మూడు రాజధానులు...


మొత్తానికి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషీయల్ రాజధానులుగా మూడు ప్రాంతాల నుంచి ఒక్కో ప్రాంతాన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నెల 20వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. అంతకు ముందు రోజు మంత్రివర్గ సమావేశమై... హై పవర్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆమోదం తెలుపనుంది. రెండు, మూడురోజుల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసే సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
andhra pradesh state develop in three capitals high power committee said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X