వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కార్పోరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్...

|
Google Oneindia TeluguNews

ఏపీలో 11 కార్పోరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్,75 మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండో డిప్యూటీ మేయర్,రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 30న కార్పోరేషన్లు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో ప్రత్యేక సమావేశానికి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.

Recommended Video

TDP Senior Minorty Leader Ziauddin Joined In YSRCP In Presence Of CM | Oneindia Telugu

 ఏపీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్లు- ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం ఏపీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్లు- ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులు,ఎక్స్‌అఫిషీయో సభ్యులంతా ఆరోజు తప్పక సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ నెల 26వ తేదీలోగా కార్పోరేటర్లు,కౌన్సిలర్లు,ఎక్స్‌అఫిషియో సభ్యులకు సమావేశానికి హాజరుకావాలన్న సమాచారాన్ని చేరవేయాలని కోరారు. ఏలూరు కార్పోరేషన్‌కు కూడా ఈ నెల 30నే మేయర్,ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుందని తెలిపారు.

state election commission notification for second deputy mayor and municipal vice chairman

రాష్ట్రంలోని కార్పోరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు,మున్సిపాలిటీలు,నగరపంచాయతీల్లో ఇద్దరు వైఎస్ ఛైర్మన్ల నియామకానికి వీలుగా మున్సిపల్ చట్టంలో సవరణలు చేస్తూ ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర కేబినెట్‌లోనూ ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించిన సీఎం జగన్... పట్టణ స్థానిక సంస్థల్లోనూ అదే పంథాను అనుసరించారు. మేయర్,డిప్యూటీ మేయర్,మున్సిపల్ ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ పదవులకు పార్టీలో తీవ్ర పోటీ నెలకొనడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన కూడా ఉంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువమందికి పదవులు ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు.

English summary
The State Election Commission has issued notification for the election of second deputy mayor in 11 corporations in AP, second vice chairman in 75 municipalities and city panchayats. It was clarified that there would be an election of a second deputy mayor and a second vice chairman in an indirect manner
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X