విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణాజిల్లాలో దొంగ నోట్ల కలకలం:సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ప్రారంభం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

కృష్ణాజిల్లా:కృష్ణాజిల్లా నందిగామలో దొంగనోట్ల వ్యవహారం సంచలనం సృష్టించింది. పాత బైపాస్ రోడ్ ప్రాంతం లో ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై మెరుపు దాడిచేశారు. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులో కి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న ఓ కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ముద్రణకు ఉపయోగపడే ఇతర సామాగ్రిని ఈ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని సీజ్ చేసి తాము అదుపులోకి తీసుకున్న ఇరువురు వ్యక్తులను విచారణ నిమిత్తం తమతో పాటు విజయవాడ తీసుకువెళ్లారు.ఇదిలా ఉండగా ఈ దొంగనోట్ల ముద్రణ వ్యవహారం నందిగామలో చర్చనీయాంశంగా మారింది. హఠాత్తుగా టాస్క్ ఫోర్స్ పోలీసుల రాక...అనంతరం ఓ నివాసంపై దాడి...దొంగ నోట్ల ముద్రణ విషయం తెలిసి స్థానికులు విస్తుపోయారు. ఆ వ్యక్తులు ఇళ్ల మధ్యనే దొంగ నోట్లు ముద్రణ చేయడానికి ప్రయత్నించడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

State’s first cyber police station opens in Vijayawada city

మరోవైపు ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో విజయవాడలో నూతనంగా సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ ను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే మరో వారం రోజుల్లో విశాఖలో కూడా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈ సందర్భంగా తెలిపారు.

అలాగే మరో మూడు నెలల్లో ఏడు సైబర్ ల్యాబ్స్ ను కూడా ప్రారంభించనున్నట్లు డిజిపి వెల్లడించారు. విజయవాడ కమిషనరేట్‌కి కొత్తగా 471 మంది సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు నూతనంగా మరో పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌ను కూడా డీజీపీ ప్రారంభించారు. 73289 09090 నెంబర్‌కు బాధితులు వీడియోలు, ఫొటోలు పంపవచ్చు అని డీజీపీ తెలిపారు.

అలాగే పోలీసులకు సైబర్ నేరాల గురించి శిక్షణ ఇస్తామన్నారు.
విజయవాడ నగరంలో 12 పోలీస్ ఇంటర్ సెప్టార్ వాహనాలు
ను కూడా ఆయన ప్రారంభించారు. ఇవి నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఉపయోగపడతాయని...అలాగే ఈ వాహనాలు24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని డిజిపి చెప్పారు.విజయవాడ ప్రజలకు పోలీసింగ్ ను మరింత దగ్గరగా చేర్చేందుకే ఈ వాహనాలు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Vijayawada:The Capital area City Vijayawada's first cyber police station was opened by AP DGP RP Thakur on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X