వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకా ఒంటరి పోరేనా..? బాబు బరువు బాద్యతలు పంచుకునేదెవరు..? బాలయ్య బండి లాగ గలడా..??

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి ప్రత్యామ్నయం లేదా..? చంద్రబాబు తర్వాత పార్టీ బాద్యతలను బుజాన వేసుకునే సామర్థ్యం ఉన్న నేత ఎవరు..? చంద్రబాబు నడిపినట్టు పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లే సమర్థత ఉన్న నేత ఎవరు.? బాలయ్య బాబుకు బరుబాద్యతలు కట్ట బెడితే మోయగలడా..?ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అభిమానులను తొలుస్తున్న చిక్కు ప్రశ్నలు.

గత ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పొందినప్పటికి నైరాశ్యానికి లోనుకాకుండా కార్యకర్తలకు భరోసానిస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో అదికార పార్టీ చేస్తున్న ఎదురు దాడిని కూడా చంద్రబాబు ఒక్కడే ఎదుర్కొంటున్నారు. బాబుకు ఆసరాగా ఎవరుకూడా అంత సమర్ధత చూపడం లేదు. మరి భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముల్లు ప్రశ్నిస్తున్నారు.

Recommended Video

చంద్రబాబు అసమర్థ పాలన వల్లే రాష్ట్రం వెనకబడింది : పైడికొండల మాణిక్యాలరావు
 చంద్రబాబుకు ఆసరా ఎవరు..! ఇంకా ఎంతకాలం ఒంటరి పోరు..??

చంద్రబాబుకు ఆసరా ఎవరు..! ఇంకా ఎంతకాలం ఒంటరి పోరు..??

అసెంబ్లీ సమావేశాల కవరేజీనీ టీవీలో చూస్తున్న తెలుగు తమ్ముళ్లు... చంద్రబాబుకు ఎదురవుతున్న అవమానాలను చూసి విలవిల్లాడుతున్నారట. చట్ట సభలో ఆయనకు అండదండగా నిలిచే ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపించడం లేదట. చట్ట సభలో కాకపోయినా, క్షేత్ర స్థాయిలోనైనా బాబుకు, టీడీపీకీ బాలయ్య అండగా నిలవాలని, మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, పార్టీని గట్టెక్కించే బరువు బాధ్యతలను ఒక్క చంద్రబాబు మీదనే పెట్టకుండా, తాను కూడా కొంత మోయాలని, (పార్టీని... బాబును) ఆదుకోవాలని తమ్ముళ్లు కోరుకుంటున్నారట. 2019 అసెంబ్లీ ఎన్నికలు టీడీపీకి పీడకలగా మారాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత ఇంత దారుణ ఓటమి ఎదురవడం ఇదే మొదటిసారి. దీని నుంచి చంద్రబాబు ఒక్కరే కాస్తంత కోలుకుని పోరాడుతున్నారు.

 అపెంబ్లీలో ఓంటరి ఫైటింగ్..! బరువు పంచుకునేది ఎవరు..?

అపెంబ్లీలో ఓంటరి ఫైటింగ్..! బరువు పంచుకునేది ఎవరు..?

అసెంబ్లీలో ఇంటా బయటా బాబుకు తోడుగా రాజకీయం చేసే నాయకులే లేరంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే.. చంద్రబాబుకు తోడుగా నందమూరి బాలక్రిష్ణ యాక్టివ్ కావాలని కోరుతున్నారు. బాలయ్యకు తమ్ముళ్ల ఆశలు.. ఆకాంక్షలు ఏమాత్రం పట్టడం లేదు. ఆయన ప్రస్తుతం రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో ఓ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత మాస్ దర్శకుడు బోయపాటి శీనుతో చిత్రం చేయడానికి కమిటయ్యారు. వీవీ వినాయక్ తో కూడా చిత్రం చేయబోతున్నారని వార్తలొచ్చాయి.

 బాలకృష్ణ కు బాద్యతలు ఇస్తే ఓకేనా..! పెదవి విరుస్తున్న పార్టీ శ్రేణులు..!!

బాలకృష్ణ కు బాద్యతలు ఇస్తే ఓకేనా..! పెదవి విరుస్తున్న పార్టీ శ్రేణులు..!!

సమీప భవిష్యత్తులో చిత్రం చేస్తానని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి హామీ ఇచ్చారట. ఈ ఐదేళ్లు ఇలా బాలయ్య స్టెప్పులతో, ఫైట్లతో బిజీ బిజీగా ఉండేట్టున్నారు. మరి, పార్టీ బరువు బాధ్యతలను చంద్రబాబు ఒక్కరే మోయక తప్పేలా లేదు. ఇదంతా చూస్తున్న తమ్ముళ్లు... 'సినిమాలకు గుడ్ బై చెప్పేయండి. ఒకవైపు, పార్టీ నాశనమవుతుంటే... మరోవైపు, సినిమాలతో గడిపేస్తారా...?' అని, మండిపడుతున్నారట. చంద్రబాబుకు తోడుగా టీడీపీని నడిపించాలని, రాయలసీమలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీని నిలబెట్టాలని, వైసీపీ/జగన్ సునామీని తట్టుకుని హిందూపురంలో గెలిచినందుకు పార్టీ రాయలసీమ బాధ్యతలు తీసుకోవాలని తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. తమ్ముళ్ల ఆవేదనను, ఆకాంక్షను అర్థం చూసుకోవచ్చు.

బాబుకు సహాయం చేసే నేత కావాలి..! లోకేష్ పై వ్యక్తం అవుతున్న సందేహాలు..!!

బాబుకు సహాయం చేసే నేత కావాలి..! లోకేష్ పై వ్యక్తం అవుతున్న సందేహాలు..!!

కానీ, బాధ్యతలను బాలయ్య నెత్తిన ఎత్తుకుంటే... పార్టీకి ప్రయోజనం ఒనగూరుతుందా...? పూడ్చలేని నష్టం మిగులుతుందా...? అని, ఆలోచనాపరులైన కొందరు తమ్ముళ్లు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు, మథనపడుతున్నారు. మొన్నటి ఎన్నికల వేళ బాలయ్య బాబు మాటలు, చేష్టలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. హిందూపురంలో అభిమానులను కొట్టడం, పరుష పదజాలంతో తిట్టడం, సినిమాల్లో మాదిరిగా దూకుడుగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. మా సోదర తమ్ముళ్లు కోరుకున్నట్టుగా, బాలయ్య తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తే... బరువు బాధ్యతలను నెత్తికెత్తుకుంటే... చంద్రబాబుకు, పార్టీకి కొత్త తలనొప్పులు మొదలైనట్టే. ఆయనను అలా సినిమాలకు వదిలేయడమే బెటర్ అని, ఆలోచనాపరులైన సీనియర్ తమ్ముళ్లు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఈ భిన్నాభిప్రాయాలపై చంద్రబాబు, బాలయ్య బాబు స్పందన ఏమిటో చూడాలి.

English summary
Is TDP chief Chandrababu Naidu an unstoppable struggle in politics? Who is the leader of the party after Chandrababu? Who is the most capable leader who can coordinate the party as Chandrababu led?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X