వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి అసెంబ్లీ‌లో అధికారుల తర్జనభర్జన....ప్రతిపక్ష నేతకు సైతం ఇంకా చాంబర్‌ను కేటాయించని పరిస్థితి

|
Google Oneindia TeluguNews

ఏపి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో కార్యాలయ కేటాయింపు ఉంటుందా... ఇప్పటికే సరైన వసతిలేక ఇద్దరి ఉప ముఖ్యమంత్రులకు ఓకే చాంబర్‌ను కేటాయిచంగా ఇప్పుడు అయిదుగురు ఉప ఉపముఖ్యమంత్రులు ఆతర్వాత ప్రతిపక్ష నేతకు కేటాయించాలి.దీంతో అధికారులు వారికి చాంబర్‌ల కేటాయింపులపై అసెంబ్లీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

 జూన్ 12 నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు,

జూన్ 12 నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు,

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈనేల 12 ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కార్యాలయాల కేటాయింపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.ముఖ్యంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్‌తో పాటు అయిదుగురు ఉపముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరియు, మంత్రులు ఇతర చీఫ్ విప్‌లు, విప్‌లకు చాంబర్లు కేటాయించాల్సి ఉంటుంది.

అసెంబ్లీలో చాంబర్ల కేటాయింపుపై తర్జనభర్జన..

అసెంబ్లీలో చాంబర్ల కేటాయింపుపై తర్జనభర్జన..

బుధవారం నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు గాను ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాంబర్‌ను మాత్రమే అధికారులు సిద్దం చేశారు.కాగ అసెంబ్లీలో అయిదుగురు డిప్యూటి సీఎంలకు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మరిము మంత్రులకు మరో అయిదుగురు విప్‌లకు, చాంబర్లు కేటాయించాల్సి ఉంది. అయితే అక్కడ సరైన స్థలం లేకపోవడంతో చాంబర్ల కేటాయింపుపై తర్జనభర్జనలు పడుతున్నారు.

ప్రతిపక్ష నేతకు సైతం చాంబర్ కేటాయింపుపై సందిగ్థం

ప్రతిపక్ష నేతకు సైతం చాంబర్ కేటాయింపుపై సందిగ్థం

కాగా గత అసెంబ్లీలో సరైన స్థలం లేకపోవడంతో ..ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు ఒకే చాంబర్ కేటాయించారు. కాగా ఇప్పుడు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండడం ఐదుగురు విప్‌లు ఉండడంతో అధికారులు కొంత సంధిగ్థంలో పడ్డారు.ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్‌కు చాంబర్‌ను సిద్దం చేసిన అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కేటాయించాల్సిన చాంబర్‌ను మాత్రం ఏర్పాటు చేయలేదు. కాగా మరో మూడు రోజులే ఉండడంతో చాంబర్ల కేటాయింపులు మాత్రం ఇద్దరి ఒక చాంబర్‌ను కేటాయించే అవకాశాలు ఉన్నాయి.కాగా మంత్రులకు అసెంబ్లీ మొదటి అంతస్థులో కేటాయించనున్నారు.

English summary
AP Opposition leader Chandrababu Naidu will get the chmaber in the assembly..? Assembly officials have to allocat the five deputy cm's and another five members vip's chambers in the AP Assembly .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X