విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం...మ‌ధ్యాహ్నానికి తుఫాన్‌గా మారే అవకాశం

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తమిళనాడు, ద‌క్షిణ కోస్తాంధ్ర జిల్లాలను కలవరపెడుతోంది. ఈ వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం నాటికి తుఫాన్‌గా మార‌నున్నట్లు సమాచారం. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాయుగుండం ప్రభావిత ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

బంగాళాఖాతంలోని ఈ వాయుగుండం వాయువ్య ప‌శ్చిమ దిశగా క‌దులుతూ ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయంగా 1120 కి.మీ దూరంలో, చైన్నైకి 1055 కి.మీ దూరంలో కేంద్రీకృత‌మైంది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో త‌మిళ‌నాడు, ద‌క్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Storm alert in Bay of Bengal to a deep depression

తొలుత అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించింది. నెల్లూరు కి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన ఈ వాయుగుండం కారణంగా తీరం వెంబ‌డి సుమారు 135 కి.మీ వేగంతో గాలులు వీచే అవ‌కాశ‌ముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారడంతో వేట‌కు వెళ్ల‌రాదని మ‌త్య‌కారుల‌కు వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం మధ్యాహ్నానికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్ గా మారిన క్రమంలో అది శ్రీహరి కోటకు తూర్పు దిశలో 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని ఎపి ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఈ తుపాను ప్రభావం నవంబర్ 14 నుంచి 17 వరకు ఉంటుందని ఆర్టీజిఎస్ అంచనా వేసింది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాల వరకు కురిసే అవకాశం ఉందని ఆర్టీజిఎస్ అధికారులు తెలిపారు.

నవంబర్ 15నాటికి ఈ తుఫాన్ తమిళనాడులో ను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం సౌత్ చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో తుపాను కదులుతుందని...దీని ప్రభావంతో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారుతున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఆర్టీజిఎస్ అధికారులు హెచ్చరించారు. వాయుగుండం తుఫాన్ గా మారినందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజిఎస్ అధికారులు సూచించారు.

{document1}

English summary
visakhapatnam: The weather department said that the low pressure in the Bay of Bengal Sea has turned into a windstorm. This windstorm seems to be turning into a tufan by Sunday afternoon. The weather department warns that ​​the coastal area of Tamilnadu and south coastal districts of Andhra Pradesh will have rainfall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X