వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం... అంతా బాబే...! గరికపాటి సంభాషణ సారాంశం అదేనా..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపు వ్యవహారం కొత్తపుంతలు తొక్కుతోంది. స్వప్రయోజనాలకోసమే కాకుండా, వ్యాపారాలకోసం పార్టీ మారినట్టు ప్రచారం జరిగినా అది సత్య దూరమని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నలుగురు ఎంపీల ఫిరాయింపు పట్ల ఎవరున్నారనే అంశంపై ఇప్పుడు కొత్త వాదన తెరమీదకు వస్తోంది. అందుకు ఆ పార్టీ కార్యకర్తతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు గరికపాటి రామ్మోహన్ రావు జరిపిన ఫోన్ సంభాషణ ఊతం ఇస్తోంది. అందరూ పార్టీ కి ద్రోహం చేస్తే ఎలా సార్ అన ఆ కార్యకర్త అడిగిన ప్రశ్నకు గరికపాటి ఆసక్తికర సమాధానం చెప్పిసట్టు ఫోన్ సంభాషణ నిర్ధారిస్తోంది. చంద్రబాబు క్షేమంగా ఉండాలనే తాము పార్టీ మారుతున్నామని గరికపాటి మిస్సైల్ లాంటి సమాదానం చెప్పారు. దీంతో అసలు ఎంపీలు ఎవరి ప్రోద్బలంతో పార్టీ మారారు అనే కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

Recommended Video

బీజేపీలోకి 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జంప్
బాబు క్షేమం కోసమే పార్టీ మారాం..! ఫోన్ సంభాషణలో నిర్ధారించిన గరికపాటి..!!

బాబు క్షేమం కోసమే పార్టీ మారాం..! ఫోన్ సంభాషణలో నిర్ధారించిన గరికపాటి..!!

టీడీపీ నుంచి బీజేపీలోకి రాజ్యసభ సభ్యులు దూకేయడమనే రాజకీయ రసవత్తర సినిమాకు కథ... స్క్రీన్ ప్లే, దర్శకత్వం....అంతా చంద్రబాబేనా...? తాజాగా, సోషల్ మీడియాలతో సాగుతున్న చర్చ ఇది. టీడీపీని, దాని అధినేతగా తనను రాజకీయంగా బతికించుకునేందుకే ఆ ఎంపీలను బీజేపీలోకి చంద్రబాబు, వ్యూహాత్మకంగా పంపించారనే చర్చ తాజాగా జరుగుతోంది. అందుకు గరిపాటి రామ్మోహన్ రావు అనే ఎంపీ పార్టీ కార్యకర్తతో జరిపిన ఫోన్ సంభాషణ మరింత బలాన్నిస్తోంది. అంతే కాకుండా గతంలో కొన్ని ఉదాహరణలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తన పార్టీ రాజ్యసభ సభ్యులను ఇప్పుడు బీజేపీలోకి పంపించారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

ఎంపీల ఫిరాయింపుల వెనక చంద్రబాబు..! రేవంత్ విషయంలో అంతే చేసిన బాబు..!!

ఎంపీల ఫిరాయింపుల వెనక చంద్రబాబు..! రేవంత్ విషయంలో అంతే చేసిన బాబు..!!

తన పార్టీ మనుగడ ప్రమాదంలో పడినప్పుడు, చంద్రబాబు నాయుడు తన వారిని ఇతర పార్టీల్లోకి పంపించడానికి కూడా వెనుకాడరు. ఇద��� గతంలోనూ జరిగింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లినప్పుడే చంద్రబాబు తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే అప్పుడు కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి వెళ్లారని అనేకమంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత అదే నిజమని తేలింది. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు రాజీకి వెళ్లడం, పొత్తు పెట్టుకోవడం... అందరం చూశాం. అలా చంద్రబాబు నాయు��ు ముందుగా తన పార్టీ నుంచి నేతలను కాంగ్రెస్ లోకి పంపి.. వారి ద్వారా కాంగ్రెస్ తో దోస్తీ చేశారు. ఆ దోస్తీకి ఏం ఫలితం దక్కిందనేది ఇక్కడ అప్రస్తుతం.

పార్టీ కష్ట కాలంలో బాబు వ్యూహాత్మక అడుగులు..! ఇప్పుడూ అదే జరిగిందా..?

పార్టీ కష్ట కాలంలో బాబు వ్యూహాత్మక అడుగులు..! ఇప్పుడూ అదే జరిగిందా..?

ఇప్పుడు కూడా అదే పని చేశారు. టీడీపీ కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికలకు ముందు చంద్రబాబు అనుకున్నదొకటి... అయిందొక్కటి. ఏపీలో, తెలంగాణలో, క���ంద్రంలో... మూడుచోట్ల చంద్రబాబు శత్రువులే గద్దెనెక్కారు. ముప్పేట దాడి మొదలైంది. ఇది ఇలాగే కొనసాగితే చంద్రబాబుకు తట్టుకోలేనంత కష్టాలు వచ్చిపడతాయి. అందుకే, ఆయన వినూత్న వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. తన ఎంపీలను ముందస్తుగా బీజేపీలోకి పంపించారు. ఇదే విషయాన్ని వెళ్లిపోయిన ఎంపీలు కూడా పరోక్షంగా ధ్రువీకరించారు. తాము చంద్రబాబుకు చెప్పే బీజేపీలోకి చేరుతున్నట్టుగా వారు ప్ర��టించారు. అంతే కాకుండా చంద్రబాబు సంక్షేమం కోసమే తాము పార్టీ మారుతున్నటు స్వయంగా పార్టీ కార్యకర్తలకే వివరిస్తున్నారు.

విదేశాల్లో బాబు..! బేజారవుతున్న కార్యకర్తలు..!!

విదేశాల్లో బాబు..! బేజారవుతున్న కార్యకర్తలు..!!

వారం కిందటే చంద్రబాబుకు సమాచారం ఇచ్చామని పార్టీ మారిన ఆ నలుగురు ఎంపీలు అంటున్నారు. వారు చెప్పినా కూడా చంద్రబాబు పట్టించుకోకుండా విదేశాలకు వెళ్లడంలోని అర్థమేమిటనే చర్చ జర���గుతోంది. ఇక్కడే ఉంటే ఉండి కూడా ఏం చేయలేదనే అపవాదు రాకుండా ఉండేందుకే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి, లోక్ సభలోని ముగ్గురు సభ్యుల మాటేమిటి...? వారు కూడా బీజేపీలోకి వెళతారా...? అందుకే, లోక్ సభ స్పీకర్ ను కూడా కలిశారా...? రెండు మూడు రోజుల్లో ఈ ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతుందేమో చూడాలి. లేదా విదేశాల నుంచి చంద్రబాబు వచ్చిన తర్వాత పరిణామాలు ఏవిధంగా ఉంటాయో ఓ లుక్కేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

English summary
There is talk of Chandrababu being strategically sent their mp's into the BJP because of his political presence as TDP and its chief. The phone conversation with Garikapati Rammohan Rao, an MP and party worker, is further strengthened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X