వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌ర‌ణం మాటున కుయుక్తులు..! ఉచ్చ‌నీచాలు మ‌రిచిన రాజ‌కీయం..!!

|
Google Oneindia TeluguNews

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య రాజ‌కీయ‌రంగు పులుముకుంది. వైసీపీ ఇదంతా టీడీపీ ప‌నిగానే ఆరోపిస్తోంది. ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ ల‌బ్దికోసం జ‌గ‌న్ ఈ క‌థంతా న‌డిపిస్తున్నాడ‌ని అదికార పార్టీ ప్ర‌త్యారోప‌ణ చేస్తోంది. ఇంత‌కీ.. వివేకానంద‌రెడ్డిని చంపేంత క‌సి, ప‌గ, ప్ర‌తీకారం ఎవ‌రికి ఉన్నాయ‌నేది ముందు తేలాల్సి ఉంది. ఎందుకంటే వైఎస్ కుటుంబంలో ఫ్యాక్ష‌న్ నీడ అంట‌ని నేత‌గా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. పార్టీల‌కు అతీతంగా అంద‌రివాడు అనే పేరు కూడా వివేకాకు ఉంది. ఇంత‌టి సున్నిత మ‌న‌స్త‌త్వంగ‌ల వివేకాలు అంత క్రూరంగా చంపాల్సిన ప‌రిస్థితి ఎందుకొచ్చింద‌నే అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

నేడే వైసిపి అభ్య‌ర్దుల జాబితా..! జ‌గ‌న్ స‌మక్షంలో కీల‌క చేరిక‌లు : రేప‌టి నుండి ప్ర‌చారం..!నేడే వైసిపి అభ్య‌ర్దుల జాబితా..! జ‌గ‌న్ స‌మక్షంలో కీల‌క చేరిక‌లు : రేప‌టి నుండి ప్ర‌చారం..!

వివేకా సున్నిత మ‌న‌స్కుడు..! అంత క్రూరంగా చంపాల్సిన ప‌రిస్థితి ఏంటి...?

వివేకా సున్నిత మ‌న‌స్కుడు..! అంత క్రూరంగా చంపాల్సిన ప‌రిస్థితి ఏంటి...?

శుక్ర‌వారం ఉద‌యం బాత్రూమ్‌లో నెత్తుటి మ‌డుగులో ప‌డిన వివేకాది మొద‌ట హార్ట్ ఎటాక్‌గానే ప‌రిగ‌ణించారు. ఎందుకంటే గుండె సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ.. ఇటీవ‌లే శ‌స్త్రచికిత్స జ‌రిగిన ఆయ‌న మ‌ర‌ణం స‌హ‌జంగానే ఇటువంటి అనుమానాన్ని క‌లిగిస్తుంది. ప‌డిపోయింది బాత్రూమ్‌లో కాబ‌ట్టి.. గోడ త‌గ‌ల‌టం వ‌ల్ల‌, నోటి నుంచి నెత్తురురావ‌టం ర‌క్త‌సిక్తం అయి ఉంటుంద‌నే అంచ‌నాకు వ‌స్తారు. నుదిటిపై గాయాలతో అనుమానం వ‌చ్చిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టంతో విష‌యం వెలుగుచూసింది.

ఎన్నిక‌ల వేళ హ‌త్యారాజ‌కీయాలు..! ఎవ‌రికి ప్ర‌యోజ‌నం..?

ఎన్నిక‌ల వేళ హ‌త్యారాజ‌కీయాలు..! ఎవ‌రికి ప్ర‌యోజ‌నం..?

వాస్త‌వానికి ఈ హ‌త్య‌తో టీడీపీ పొందే ప్ర‌త్యేక లాభం ఏమీ ఉండ‌దు. వైసీపీ కూడా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇటువంటి చికాకులు పెట్టుకోవాల‌ని చూడ‌దు. అయినా.. సంఘ‌ట‌న జ‌రిగింది. అది కాస్తా.. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌టంతో ఇరు పార్టీలు ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకునే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టాయి. దీనివ‌ల్ల కొద్దిరోజులు రెండు పార్టీల‌కు కావాల్సినంత ప్ర‌చారం.. వీలైనంత విమ‌ర్శించుకునే అవ‌కాశంగానే ప్ర‌జ‌లు చూస్తారు త‌ప్ప మ‌రో కోణంలో రాజ‌కీయ నేత‌లు ఆలోచించిన‌ట్టు ఆలొచించ‌రు.

 రాజ‌కీయాల్లో చురుగ్గా లేని వివేకా..! మ‌ట్టుబెట్టాల్సిన అవ‌స‌రం ఎవ‌రికుంది..?

రాజ‌కీయాల్లో చురుగ్గా లేని వివేకా..! మ‌ట్టుబెట్టాల్సిన అవ‌స‌రం ఎవ‌రికుంది..?

ఫ్యాక్ష‌న్ సీమ‌లో ఇటువంటి దారుణాలు నిత్యం జ‌రుగుతూనే ఉంటాయి. కాక‌పోతే.. ఎన్నిక‌ల‌పుడు జ‌ర‌గ‌టంతో దీనికింత ప్రాచూర్యం వ‌చ్చిందంటూ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. పోలీసుల కోణంలో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. దాదాపు నిందితులు ఎవ‌ర‌నేది కూడా నిర్దారించుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే రాజ‌కీయంగా ఇప్ప‌టి వ‌ర‌కూ ఉత్కంఠ‌త క‌లిగించిన మ‌ర‌ణం వెనుక‌.. సున్నిత‌మైన అంశాలున్నాయ‌నే వాద‌న వినిపిస్తుంది. ఇదంతా వ్య‌క్తిగ‌త‌మైన విష‌యాలు కావ‌టం.. కుటుంబానికి సంంబంధించిన అంశాలు కూడా ఉండ‌టంతో పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు.

శ‌వ రాజ‌కీయం..! అంతం చేస్తే సరిపోతుందా ?

శ‌వ రాజ‌కీయం..! అంతం చేస్తే సరిపోతుందా ?

ఇక ఇదే విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లాల‌ని టీడిపి నేత‌ల‌కు భావిస్తున్నారు. ఎవ‌రికి వారు.. ఎదుర‌య్యే ప్ర‌తి సంఘ‌ట‌న‌నూ త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవాల‌ని చూస్తే.. ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంద‌నేది.. వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం త‌రువాత స్పందించిన నేత‌లు, పార్టీల‌కు మ‌రి కొద్దిస‌మ‌యంలో పోలీసులు చెప్ప‌బోయే నిజ‌మే క‌ళ్లు తెరిపిస్తుంది. ఈ లోపు తాత్కాలిక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పార్టీ నేత‌లు చేసుకుంటున్న ఆరోప‌ణలు మాత్రం వారి వారి నైతిక‌త‌ను గుర్తుచేస్తున్నాయి.

English summary
The murder of YS Vivekananda Reddy is politicizing. The YCP alleges that this is the work of TDP. The tdp party alleging the opposite of the party's election campaign for the political benefit of the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X