వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టటం వెనుక బలమైన కారణం ఉంది ... అదేంటో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి జనసేన పార్టీ పనిచేస్తోందని మొదట నుండీ చెప్తున్న జనసేన పార్టీ స్థాపన విషయంలో ఆసక్తికర కోణాలను వెల్లడించారు మెగా బ్రదర్స్ . జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడం వెనుక పెద్ద కారణమే ఉందని పేర్కొన్నారు . ఒక పక్క మెగా ఫ్యామిలీ చిరంజీవి రాజకీయాల్లో పడిన ఇబ్బందులు ను చూసి, పవన్ కళ్యాణ్ లాంటి ఇబ్బందులు అవసరం లేదని పార్టీ పెట్టొద్దని వద్దని వారించినా పవన్ కళ్యాణ్ మాత్రం అకుంఠిత దీక్షతో జనసేన పార్టీని స్థాపించారు.

 గోదావరి జిల్లాల తాగునీటి బాధలే జనసేన పార్టీ పెట్టటానికి కారణం అన్న పవన్ కళ్యాణ్

గోదావరి జిల్లాల తాగునీటి బాధలే జనసేన పార్టీ పెట్టటానికి కారణం అన్న పవన్ కళ్యాణ్

ఇక గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు జనసేన ఆదరిస్తారని భావిస్తే కేవలం ఒకే ఒక ఎమ్మెల్యేని గెలిపించి పవన్ కళ్యాణ్ ని సైతం ఓడించారు ఏపీ ప్రజలు. అయితే ఎన్నికల్లో ఓటమికి తనకంటూ సహకరించి మీడియా లేకపోవడం, డబ్బు లేకపోవడం ప్రధాన కారణాలని భావిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టడానికి గల కారణమేంటంటే గోదావరి జిల్లాల తాగునీటి బాధలేనని స్వయంగా ఆయనే చెప్పారు . జనసేన పార్టీ స్థాపించడానికి గోదావరి జిల్లాలే కారణమని స్పష్టం చేశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అమరావతిలో పార్టీ కార్యాలయంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో తాగేందుకు స్వచ్చమైన తాగునీరు లేకపోవడం తనను చాలా కలచివేసిందని చెప్పుకొచ్చారు.

 ప్రజల తాగునీటి కష్టాలు కదిలించాయన్న పవన్ .. వ్యక్తిగత స్వార్ధం ఏం లేదన్న పవన్

ప్రజల తాగునీటి కష్టాలు కదిలించాయన్న పవన్ .. వ్యక్తిగత స్వార్ధం ఏం లేదన్న పవన్

ఉభయగోదావరి జిల్లాలలో ఎటువైపు చూసినా నీరు ఉంటుందని కానీ తాగడానికి మాత్రం స్వచ్ఛమైన నీరు దొరకదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మరో 25 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటనే ఆలోచన తన మనసును బాధించిందని చెప్పుకొచ్చారు. ఆ ఆలోచనే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని పవన్ అసలు విషయాన్ని వెల్లడించారు.
తన వ్యక్తిగత లాభం కోసం పార్టీ పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. అలా స్వార్థం కోసమే అయితే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక అలా అయితే ఆఫీసులు కట్టనక్కర్లేదని, ఇతరుల చేత తాను మాటలు పడక్కర్లేదని చెప్పుకొచ్చారు. కేవలం తాను ఒక్కడినే పోటీ చేస్తే సరిపోయేది అని చెప్పుకొచ్చారు.తాను కోరుకున్నది తన స్వార్థం కాదన్నారు పవన్ .

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టటం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదని నాగబాబు సంచలనం ..పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టటం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదని నాగబాబు సంచలనం ..

మంచి చెయ్యాలనే రాజకీయాల్లోకి వచ్చాను .. గెలుపోటములు సహజం అన్న పవన్

మంచి చెయ్యాలనే రాజకీయాల్లోకి వచ్చాను .. గెలుపోటములు సహజం అన్న పవన్


ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్ కళ్యాణ్.ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని పవన్ అభిప్రాయపడ్డారు. ఒక్క ఓటమి తనను క్రుంగదీస్తుందా? ఒక్క ఓటమి జనసైనికుల్ని వెనక్కి నెడుతుందా? అని ప్రశ్నించారు. ఎన్నో పరాజయాల్ని తట్టుకొని నిలబడిన తమను ఈ ఓటమి ఏమీ చేయలేదన్నారు. మొత్తానికి జనసేన పార్టీ స్థాపించడానికి గోదావరి జిల్లాల ప్రజల తాగునీటి కష్టాలు కారణం అని చెప్పి ఆయన పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో వచ్చిన జనసేన పార్టీని ప్రజలు అర్థం చేసుకుని ఆదరించి రోజులు తప్పకుండా వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Janasena chief Pawan Kalyan said that in the two districts of godavari , there is water to be found but there is no drinking water . If this is the case now, after another 25 years, what the situation is will faced by the people the thought of this was hurt his mind. Pawan revealed that the idea had brought him into politics.He made it clear that the party was not for his own personal benefit. For selfish reasons, He said that it was enough to compete alone. What he wanted was not his selfishness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X