వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూకంపం: ఎవరెస్ట్‌పై 18,000 అడుగుల ఎత్తులో ఏపీ, టీ పర్వతారోహకులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లకు చెందిన ఇరవై మంది పర్వతారోహకులు భూకంపం వల్ల ఐదు రోజులుగా ఎవరెస్టుపై చిక్కుకుపోయారని సమాచారం. వారు ఎవరెస్టుపై సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్నారు.

ఉత్తర భాగంలో, చైనా వైపు ఉన్నారు. భారత్‌, చైనా ప్రభుత్వాలు తమకు సహకరించి తమను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని ఆ బృందానికి సారథ్యం వహిస్తున్న శేఖర్‌ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తెలుగువారు చిక్కుకున్నారన్న వార్తతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు వారిని సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టింది. హైదరాబాదు నుంచి ఏప్రిల్‌ 16న ఈ పర్వతారోహకుల బృందం ఎవరెస్టు అధిరోహించడానికి బయలుదేరింది.

Stuck at 18,000 feet, mountaineers from Telangana, Andhra Pradesh cry for help

యూపీలో 50 జిల్లాలకు భూకంప ముప్పు

యూపీలోని 75 జిల్లాల్లో 50 జిల్లాలకు భూకంపం ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ పరిశీలన ప్రకారం అందులో 29 జిల్లాలు జోన్‌ 4 కింద హై భూకంప జోన్‌లో ఉన్నాయి. భూకంప ప్రమాదాన్ని బట్టి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించింది. నేపాల్, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి సరిహద్దు ప్రాంతాలు జోన్‌ 4 కిందికి వస్తాయి.

English summary
Stranded at 17,598 feet above sea level for five consecutive days, 20 mountaineers from the two states of Andhra Pradesh and Telangana are now desperately calling out for help. The team that took off on this hazardous expedition of Mt Everest from Hyderabad on April 16 was forced to cut short the climb and take shelter at the base camp, after the devastating 7.9 magnitude earthquake struck Nepal on April 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X