వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..! 50 కిమీ వరకు బస్ పాస్ లు అనుమతి..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించేందకు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో బాగంగానే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త అందించింది జగన్ సర్కార్. ఆర్ధికంగా తల్లిదండ్రుల మీద ఆదారపడే విద్యార్థుల పాకెట్ మనీ కి భంగం కలగకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వారి చదువులకు సహకరిస్తున్నట్టుగానే వారి బస్సు పాసుల అంశంలో వినూత్న అడుగులు వేస్తోంది ఏపి ప్రభుత్వం. స్టూడెంట్ రాయితీ బస్‌పాస్ కిలోమీటర్ల పరిధిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 35 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పరిధి పెంపు స్కూల్, కాలేజీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Recommended Video

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం..పట్టించుకోని అధికారులు
Student bus pass travel distance limit will be extended to 50 km

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ఇచ్చే రాయితీ బస్‌పాస్ పరిధిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపి ప్రభుత్వం. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఇప్పటి వరకు బస్‌పాస్‌ల పరిధి 35 కిలోమీటర్లు ఉండేది.. తాజా నిర్ణయంతో అది 50 కిలోమీటర్లకు పెరిగింది. స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఊరట కలిగింది. 35 కిలోమీటర్లు దాటి వెళ్లే విద్యార్థులకు బస్‌పాస్‌లు అర్హత లేకుండా పోయింది. 35 కిలోమీటర్ల పరిధి నిబంధనతో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో సానుకూలంగా స్పందించి పరిధిని పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 660 విద్యాసంస్థలు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థుల కష్టాలను గమనించిన సర్కార్.. రాయితీ బస్‌పాస్‌ల కిలోమీటర్ల పరిధిని 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. దాదాపు 15 వేల మంది విద్యార్థులు బస్‌పాస్‌లు పొందనున్నారు. తాజా నిర్ణయంతో సర్కార్‌కు ఏడాదికి 18.50 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

English summary
The government has taken a key decision by increasing the concession bus pass to the students who travel in RTC buses. The authorities have issued orders to this extent. Accordingly, the bus pass range is 35 km. With the latest decision, it increased to 50 kilometres. Students studying in school and colleges were relieved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X