వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పగలు చదువులతో కుస్తీ .. రాత్రి చోరీలతో మస్తీ ... స్టూడెంట్ దొంగలు

|
Google Oneindia TeluguNews

చదువుకొని బాగుపడండి అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలలలో చేర్పిస్తున్నారు. కానీ అక్కడ వారు ఏం చేస్తున్నారో, ఎలాంటి జీవితానికి అలవాటు పడుతున్నారో మాత్రం తల్లిదండ్రులు పట్టించుకోని పరిస్థితి ఉంది. ఫలితంగా విద్యార్థి దశలోనే దొంగలుగా మారుతూ కటకటాల పాలవుతున్నారు చాలామంది యువకులు. ఇటీవల కాలంలో నేరాలు చేసిన వారిని గమనిస్తే చదువుకునే విద్యార్థులే ఎక్కువగా ఉండటం, వారేచోరీలకు పాల్పడటం , హత్యలు, లైంగిక వేధింపులు వంటి దారుణాలకు పాల్పడడం కనిపిస్తుంది. ఇది సమాజంలో ఒక ఆందోళనకర వాతావరణానికి కారణమౌతుంది.

 జల్సా చేయడానికి డబ్బుల కోసం చోరీలకు తెగబడిన విద్యార్థులు

జల్సా చేయడానికి డబ్బుల కోసం చోరీలకు తెగబడిన విద్యార్థులు

ఎన్నో ఆశలతో చదువుకుంటారని కాలేజీకి పంపించిన ఇద్దరు విద్యార్థులు చక్కగా చదువుకోకుండా జల్సాలకు అలవాటుపడి రాత్రిళ్లు చోరీలు చేయడం ప్రారంభించారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం ఇందిరా నగర్ కు చెందిన కందుకూరి నరేష్, అదే జిల్లా దత్తప్పగూడెం కు చెందిన ముక్కెర ప్రశాంత్ లు ఇద్దరు జల్సా చేయడానికి డబ్బులు కావాలని దొంగతనాలకు అలవాటుపడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరినీ మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో నరేష్ నిజాం కళాశాల వసతి గృహం లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఇక ప్రశాంత్ ఎస్సీ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు.

<strong>రాజధాని ముంపు ప్రాంతమని నిరూపిస్తారా... నా భూమి రాసిస్తా ..బొత్సాను సవాల్ చేసిన ఓ సాధారణ మహిళ </strong>రాజధాని ముంపు ప్రాంతమని నిరూపిస్తారా... నా భూమి రాసిస్తా ..బొత్సాను సవాల్ చేసిన ఓ సాధారణ మహిళ

పగలు పాఠాలు.. రాత్రైతే చోరీలు ఇదీ విద్యార్థుల కథ

పగలు పాఠాలు.. రాత్రైతే చోరీలు ఇదీ విద్యార్థుల కథ

పగలంతా కాలీజీలకి వెళ్లి చదువుకునే వీరు రాత్రయితే చాలు దొంగతనాలకు తెగబడుతున్నారు. ఈ ఇద్దరు స్నేహితులు జల్సాలకు అలవాటు పడి మేడిపల్లి, ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, భువనగిరి పోలీసుస్టేషన్ల పరిధిలోని ఇళ్లలో ఎవరూ లేనిది గమనించి తాళాలను పగలగొట్టి చోరీలు చేశారు. ఇప్పటివరకు మీరు నాలుగు ఇళ్లలో చోరీలు చేశారు. రెండు బైకులు అపహరించారు.ఈ నెల 21 బోడుప్పల్‌ ఇందిరానగర్‌లో కె.ఉమారాణి ఇంట్లో చోరీ జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందటంతో మేడిపల్లి డీఐ టంగుటూరి శ్రీను, ఎస్సై నర్సింగ్‌ రాథోడ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నరేష్‌, ప్రశాంత్‌లను అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారు నేరాలు అంగీకరించారు.

 దొంగతనాలతో భవిష్యత్ నాశనం చేసుకున్న విద్యార్థులు ..

దొంగతనాలతో భవిష్యత్ నాశనం చేసుకున్న విద్యార్థులు ..

ఇక నరేష్, ప్రశాంత్ ల వద్ద నుండి రెండు బైకులు, తులం బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొన్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
జల్సాలకు అలవాటుపడి కటకటాలపాలై జీవితాన్ని నిలువునా నాశనం చేసుకున్నారు ఇద్దరు విద్యార్థులు. చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన వారు , పగలు చదువుతూనే, రాత్రిళ్ళు చోరీలకు పాల్పడుతూ పోలీసుల చేతికి చిక్కి అడ్డంగా బుక్ అయ్యారు.

English summary
Both Kandukuri Naresh of Indira Nagar and Mukhera Prashant of Dattappa Gudem of the same district have been accused of robberies. Medipally police took the two men who were involved in robberies in locked houses and seized their property. Among them is Naresh Nizam, who is studying in the college dormitory. Prashant is staying in the SC hostel and studying for a degree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X