వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాదయాత్రలో షాకింగ్, నిజమా: 'జగన్ చెప్పిందేమిటి, చేస్తుందేమిటీ!?'

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇంటర్ పిల్లలు ఉన్నట్లుగా మీడియాలో ప్రచారం సాగుతోంది. 14 ఏళ్ల లోపు పిల్లలతో పని చేయించడం నేరమని, కానీ జగన్ పాదయాత్రలో 25 మంది విద్యార్థులను అలా మార్చివేశారని అంటున్నారు.

జగన్ పాదయాత్రలో ఉత్సాహం ముందుకు సాగుతున్నారు. ఆయన అందరినీ పలకరిస్తూ, అక్కడక్కడ సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన పాదయాత్ర వైసిపిలోను ఉత్సాహం తీసుకు వస్తోంది. అయితే ఈ యాత్ర సందర్భంగా చిన్నపిల్లలతో పని చేయిస్తున్నారని మీడియాలో ప్రచారం సాగుతుండటం గమనార్హం.

 జగన్ చెప్పిందేంటి, చేసేదేమిటి అంటూ

జగన్ చెప్పిందేంటి, చేసేదేమిటి అంటూ

తాను అధికారంలోకి వస్తే పిల్లలను బడికి పంపే ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తానని హామీ జగన్ హామీ ఇచ్చారని, అంతేకాదు మెడిసిన్, ఇంజనీరింగ్ చదివే పిల్లల ఫీజులను పూర్తిగా తన ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారని కానీ పాదయాత్రలో మాత్రం జరుగుతోందని వేరు అని అంటున్నారు.

 పనులు చేయించేందుకు విద్యార్థులు

పనులు చేయించేందుకు విద్యార్థులు

జగన్ పాదయాత్ర కర్నూలులో కొనసాగుతోంది. జగన్ వెంట వచ్చే నేతలు, కార్యకర్తల కోసం రోజూ పార్టీ తరపున భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భోజనాల పనులను చేయించడానికి నాయకులు ఎమ్మిగనూరులోని ఎస్‌డబ్ల్యూఆర్ హాస్టల్ విద్యార్థులను తీసుకు వచ్చారని అంటున్నారు. మూడు రోజుల పాటు పని కోసం తీసుకు వచ్చారని అంటున్నారు.

 ఈ పనులు చేయాలట

ఈ పనులు చేయాలట

పాత్రలు కడగడం, కూరగాయలు తరగడం, తినేవారికి వడ్డించడం, నీరు పోయడం, శామియానాలు, టెంట్లు వేయడం అన్నీ వారే చేస్తున్నారని, ఒక్క వంట తప్ప అన్ని చేస్తున్నారని అంటున్నారు. ఇందుకు 25 మంది విద్యార్థులను తీసుకు వచ్చారని చెబుతున్నారు. దీని గురించి విద్యార్థులను అడిగితే వారు ముక్తసరిగా సమాధానం చెప్పారట.

 విద్యార్థులకు డబ్బులిస్తున్నారని

విద్యార్థులకు డబ్బులిస్తున్నారని

విద్యార్థులను తీసుకు వచ్చిన వ్యక్తి మాత్రం ఒక్కొక్కరికి రూ.180 ఇస్తారని చెప్పాడని అంటున్నారు. కాగా, విద్యార్థులు వచ్చినట్లు హాస్టల్ వార్డెన్‌కు తెలియదట. అతను పట్టించుకోకపోవడం వల్లే తీసుకు వచ్చారని అంటున్నారు.

English summary
It is said that 25 students are working in YSR Congress Party chief YS Jagan Mohan Reddy padayatra in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X