శ్రీవారి ఆభరణాలు మాయం నిజమే: ఛైర్మన్ సుబ్బారెడ్డి సంచలనం: ఏం చేయబోతున్నారు..!
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కొద్ది కాలం క్రితం శ్రీవారి ఆభరణాల విషయంలో వివాదం జరిగింది. టీటీడీ ఈవో..ప్రభుత్వం శ్రీవారి ఆభరణాల విషయంలో ఎటువంటి తప్పు జరగలేదని స్పష్టం చేసారు. శ్రీవారి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు నాడు ఆభరణాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ వివాదం ప్రభుత్వ వివరణతో సద్దుమణిగింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో తిరిగి ఇప్పుడు ఈ ఆభరణాల వ్యవహారం సంచలనం మారుతోంది.
శ్రీవారి ఆభరణాలు మాయం..విచారణ
తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి విలువైన ఆభరణాలను బయటకు వెళ్లాయి. వాటి పైన సమగ్ర విచారణ కు కమిటీ వేస్తున్నట్లు టీటీడీ నూతన ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంలో ఎంతటి వారు ఉన్న కఠిన చర్యలు తీసుకొనేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేసారు. టీటీడీ నిధులను భక్తులకు సైకర్యాలు కల్పించేందుకు..దేవాలయాల అభివృద్దికి వినియోగిస్తామని..అంతే కానీ గత ప్రభుత్వం చేసిన విధంగా అభివృద్ది పేరు తో నిధులను బయటకు పంపే ప్రసక్తే లేదని చెప్పారు. తిరుమలలో వంశ పారపర్యంగా వస్తున్న ఆర్చకుల విషయంలో నెలకొన్న వివాదం పైన పీఠాధిపతులు..మేధావుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసు కుంటామని ఛైర్మన్ వివరించారు. శ్రీవారిని ప్రముఖలు దర్శనం..బ్రేక్ దర్మనం విధానంలోనూ మార్పులు తీసుకొస్తు న్నామని.. సామాన్య భక్తలకు త్వరిత గతిన దర్మనం జరిగేలా నిర్ణయాలు ఉంటాయని సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. త్వరలోనే పాలకవర్గం పూర్తి స్థాయిలో ఏర్పాటు అవుతుందని చెప్పుకొచ్చారు.

మరోసారి తెర మీదకు నగల మాయం వ్యవహారం..
ఇప్పుడు ఛైర్మన్ సుబ్బారెడ్డి శ్రీవారి నగల వ్యవహారం చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది కాలం క్రితం శ్రీవారి ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు శ్రీవారి నగల వ్యవహారం గురించి కామెంట్లు చేసారు. దీంతో అప్పట్లో దీని పైన రాజకీయంగానూ రగడ జరిగింది. అయితే, ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది టీటీడీ ఈవోను ముఖ్యమంత్రి పిలిచి సమీక్షించారు. ఆ తరువాత ఈవో సింఘాల్ దీని పైన వివరణ ఇచ్చారు. శ్రీవారి ఆభరణాల విషయంలో ఎటువంటి పొరపాటు జరగలేదని తేల్చి చెప్పారు. శ్రీవారి ఆభరణాలు అన్ని భద్రంగా ఉన్నాయని వివరించారు. ఆభరణాల ప్రదర్శన గురించి పీఠాధిపతులు..జీయర్ల అభిప్రాయం తీసుకొని ప్రదర్శించాలా లేదా అనే విషయం పైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తరువాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ స్వయంగా టీటీడీలో శ్రీవారి నగలు బయటకు వెళ్లాయని ..దీని పై విచారణ చేయిస్తామని చెప్పటం ద్వారా మరో సారి ఈ విషయం కలకలంగా మారింది.