లడ్డూ వివాదంలో సుప్రీంలో కీలక పరిణామం- సుబ్రమణ్య స్వామి తాజా పిటీషన్ తో..!!
సంచలనంగా మారిన లడ్డూ వివాదం కొత్త మలుపు తీసుకుంది. సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు పైన సుప్రీం కీలక మార్గదర్శకాలు జారీ చేస్తూ.. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా సిట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో పేర్కొన్న అంశాలు ఇప్పుడు రాజకీయ దుమారంగా మారాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇదే అంశం విచారణ కోసం ఏకసభ్య కమిటీ నియమించింది. ఇప్పుడు ఈ నిర్ణయం పైన సుబ్రమణ్య స్వామి సుప్రీం లో పిటీషన్ దాఖలు చేసారు. రేపు (సోమవారం) ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణ చేయనుంది.
సంచలనం రేపిన టీటీడీ లడ్డూ వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదం ప్రారంభంలో సుప్రీంలో దాఖలైన పిటీషన్ల పైన విచారణ చేసిన న్యాయస్థానం.. కీలక ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో పూర్తి విచారణ కోసం సీబీఐ ఆధ్వర్యంలో సిట్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు సుదీర్ఘంగా విచారణ చేసిన సీబీఐ అధికారులు కొందరిని అరెస్ట్ చేసారు. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. అందులో లడ్డూ సరఫరా.. కల్తీ.. జరిగిన పరిణామాల ను వివరించారు. కాగా, ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా విమర్శలు - ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇదే కేసులో ప్రభుత్వం ఏక సభ్య కమిటీని విచారణ కోసం నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ కేసులో చోటు చేసుకున్న పరిణామాలు.. సూత్రధారులను గుర్తించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వ నిర్ణయం పై అభ్యంతరం
అయితే, ఇప్పుడు ఈ నిర్ణయం పైన సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం నియమించిన సిట్ విచారణ వేళ.. ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేయటాన్ని ఆయన సవాల్ చేసారు. సుప్రీం ఈ కేసును విచారణ చేస్తున్న సమయంలో నియమించిన సిట్ ఉండగా.. మరో కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ పిటీషన్ రేపు ( సోమవారం) సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జయసూర్య విచారణ చేయనున్నారు. ఈ మేరకు సుబ్రమణ్య స్వామి వేసిన కేసు లిస్టు అయింది. కాగా.. ఈ పిటీషన్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేసు విచారణ చేసిన సిట్.. అదే విధంగా ముఖ్యమంత్రి, సీబీ, సీబీఐ, టీటీడీ ను ప్రతివాదులుగా చేర్చారు. ప్రస్తుతం ఏపీ లో లడ్డూ వివాదమే ప్రధాన అంశంగా మారటంతో... సుప్రీం వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో.. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటీషన్ పైన చేపట్టనున్న విచారణతో పాటుగా ఏం చెప్పబోతుందనేది ఉత్కంఠగా మారుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications