కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు పైనే పోటీ చేసి: జగన్‌కు షాకిస్తూ టీడీపీలోకి కీలక నేత, కుప్పంపై ఆసక్తికరం

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జిల్లాకు చెందిన జడ్పీ మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుబ్రహ్మణ్యం రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

ఇదీ నాకిచ్చింది, వెళ్తున్నా: జగన్‌కు వైయస్ సన్నిహితుడి భావోద్వేగ లేఖ, సుబ్రహ్మణ్యం దారెటు?ఇదీ నాకిచ్చింది, వెళ్తున్నా: జగన్‌కు వైయస్ సన్నిహితుడి భావోద్వేగ లేఖ, సుబ్రహ్మణ్యం దారెటు?

ఈ సందర్భంగా వారి మధ్య పార్టీలో చేరిక విషయమై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అనుచరులతో కలిసి తాను పార్టీలో చేరుతానని చెప్పారని సమాచారం. ఆయన ఈ నెల 9న కుప్పంలో చంద్రబాబు సమక్షంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.

జగన్‌కు గట్టి షాక్: వైసీపీ షరతులు, చంద్రబాబుపై పోటీ చేసిన నేత రాజీనామా, కంటతడిజగన్‌కు గట్టి షాక్: వైసీపీ షరతులు, చంద్రబాబుపై పోటీ చేసిన నేత రాజీనామా, కంటతడి

 కుప్పం ఇంచార్జ్‌గా నియమించే అవకాశం

కుప్పం ఇంచార్జ్‌గా నియమించే అవకాశం

సుబ్రహ్మణ్యం రెడ్డిని కుప్పం నియోకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న కుప్పంలో జన్మభూమి - మావూరు కార్యక్రమంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్న అనంతరం బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.

 కుప్పం ఇంచార్జ్ అయితే ఆసక్తికరమే

కుప్పం ఇంచార్జ్ అయితే ఆసక్తికరమే

గతంలో సుబ్రహ్మణ్యం రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోటీ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శాంతిపురం జెడ్పీటీసీగా గెలుపొందారు. వైయస్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కుప్పంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తమ ప్రభుత్వం వచ్చాక, తాను జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాద్యతలు స్వీకరించాక కుప్పంలో అభివృద్ధి పనులు జరిగాయని గతంలో పదేపదే విమర్శలు చేశారు. ఇప్పుడు అదే సుబ్రహ్మణ్యం రెడ్డి టీడీపీలో చేరడం, ఆయనకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

అందుకే వైసీపీని వీడారు

అందుకే వైసీపీని వీడారు

అధిష్టానం, స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుబ్రహ్మణ్యం రెడ్డి ఇటీవల వైసీపీని వీడిన విషయం తెలిసిందే. ఆయన పార్టీని వీడిన సందర్భంలో ఉద్వేగానికి లోనయ్యారు. కానీ పరిస్థితుల దృష్ట్యా పార్టీని వీడారు. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

జగన్‌కు లేఖ రాసి బయటకు

జగన్‌కు లేఖ రాసి బయటకు

వైసీపీకి రాజీనామా చేసిన సమయంలో సుబ్రహ్మణ్యం రెడ్డి అధినేత జగన్‌కు రెండు పేజీల లేఖ రాశారు. తాను ఏ పార్టీలో చేరుతానో అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పార్టీ మారుతారని రెండు నెలల క్రితమే వార్తలు వచ్చాయి. అప్పుడు ఆ వార్తలను కొట్టిపారేశారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేయడంతో టీడీపీలో చేరుతారని తేలిపోయింది.

English summary
Former YSR Congress party leader Subramanyam Reddy to join Telugudesam Party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X