వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీణా-వాణీలను విడదీసేందుకు: సక్సెస్ రేట్ 80 శాతం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత పన్నెండేళ్లుగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్న అవిభక్త కవలలు వీణా-వాణీల శస్త్ర చికిత్కల పైన ఆశలు చిగురుస్తున్నాయి. కొంచం కష్టమైన వారిని శస్త్ర చికిత్స ద్వారా వేరు చేసేందుకు లండన్‌కు చెందిన గ్రేట్ అర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి వైద్య బృందం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు 80 శాతం వరకు అవకాశాలున్నాయని వైద్య బృందంలోని డాక్టర్ డేవిడ్ జేమ్స్ డునానే, డాక్టర్ జిలాని చెప్పారు.

హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రిలో ఉంటున్న చిన్నారులకు శనివారం వారు కొన్ని పరీక్షలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీణా-వాణీలను వేరు చేసేందుకు కనీసం ఆరు నుండి తొమ్మిది నెలల సమయం పడుతుందని చెప్పారు. అయిదంచెల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. దాదాపు 60-100 మంది నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు.

ఈ శస్త్ర చికిత్స సకల వసతులు ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమన్నారు. లండన్లోని తమ ఆసుపత్రి ఇందుకు అనువైనది కావడంతో అక్కడకు తరలిస్తామన్నారు. గతంలోను ఇదే తరహా రెండు అవిభక్త కవల జంటలలకు శస్త్ర్ర చికిత్స చేసి విజయవంతంగా చేశారని చెప్పారు. కాగా, లండన్ వైద్య బృందం గతంలో ఓ అవిభక్త కవలలను విడదీశారు. దీనిపై వీణా-వాణీల తల్లిదండ్రులు స్పందించారు.

తమ పిల్లలను ఇలా చూడలేకపోతున్నామని, ఇప్పటికే పలుమార్లు వైద్యులు విడదీసేందుకు ముందుకు వచ్చారని, ఇప్పుడు లండన్ వైద్యులు చెబుతున్న తీరు చూస్తుంటే ఆశ పుడుతోందని, తమకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. తమ పిల్లల్ని వేరు చేసేందుకు తాము పూర్తిగా అనుమతిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు.

 వీణా వాణీ

వీణా వాణీ

అతుక్కున్న తలలతో జన్మించిన చిన్నారులు వీణా,వాణిలను శస్త్రచికిత్సతో విడదీయవచ్చని లండన్‌లోని గ్రేట్‌ అర్మండ్‌ సీ్ట్రట్‌ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు డేవిడ్‌, జిలానీ స్పష్టం చేశారు.

 వీణా వాణీ

వీణా వాణీ

శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చిన్నారులను పరీక్షించిన వైద్యులు.. రిపోర్ట్స్‌ను విశ్లేషించి వారి తల్లిదండ్రులు మురళీగౌడ్‌, నాగలక్ష్మిలతో మాట్లాడారు. వారిని విజయవంతంగా వేరు చేయడానికి 80 శాతం అవకాశం ఉందని తెలిపారు.

 వీణా వాణీ

వీణా వాణీ

గతంలో తాము ఇదే తరహాలో రెండు కేసుల్లో శస్త్రచికిత్సలు చేసి ఫలితాలను పొందామన్నారు. వీరికి ఐదు దశల్లో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని.. 100 మంది వరకు శస్త్రనిపుణులు, వైద్యులు ఈ శస్త్రచికిత్సలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు.

 వీణా వాణీ

వీణా వాణీ

మొత్తం చికిత్స పూర్తి కావడానికి ఆర్నెల్ల నుంచి సంవత్సరం పట్టే అవకాశం ఉందన్నారు. తమ చిన్నారులకు బాగయ్యే అవకాశం 80 శాతం ఉందంటే.. తమకు అంతకంటే ఏం కావాలని వీణ, వాణి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

 వీణా వాణీ

వీణా వాణీ

శస్త్రచికిత్సకు వారు తమ అంగీకారం తెలిపారు. కాగా.. వీణావాణి విషయమై లండన్‌ వైద్యుల బృందం శనివారం సచివాలయంలో తెలంగాణ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ చందాను కలిసింది.

 వీణా వాణీ

వీణా వాణీ

గత పన్నెండేళ్లుగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్న అవిభక్త కవలలు వీణా-వాణీల శస్త్ర చికిత్కల పైన ఆశలు చిగురుస్తున్నాయి. కొంచం కష్టమైన వారిని శస్త్ర చికిత్స ద్వారా వేరు చేసేందుకు లండన్‌కు చెందిన గ్రేట్ అర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి వైద్య బృందం సంసిద్ధత వ్యక్తం చేసింది.

English summary
Two London-based doctors have brought new hope into the lives of 11-year-old conjoined twins Veena-Vani, based at the state-run Niloufer hospital by asserting that the success rate to separate the duo is more than 80%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X