హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్య...అదిరిందయ్యా!:పరిస్థితి చక్కదిద్దుకోవడానికి చక్కటి ప్లాన్...

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అనంతపురం:నందమూరి బాలకృష్ణ...తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని ప్రముఖ హీరో. ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ కుమారుడిగా ఘనమైన బ్యాక్ గ్రౌండ్ తో తెరంగ్రేటం చేసి ఆ తరువాత అనతికాలంలోనే స్టార్ హీరో గా ఎదిగిన విజయవంతమైన కథానాయకుడు.

క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే బాలయ్య బాబు గత ఎన్నికల్లో రాజకీయ ఆరంగ్రేటం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత కొంతకాలంగా ఒక విమర్శని ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. సిఎం చంద్రబాబు బావమరిదిగా నియోజకవర్గం అభివృద్ది విషయంలో ఢోకా లేకపోయినా...స్థానికంగా అందుబాటులో ఉండటం లేదనే అపప్రథ ఎదర్కొంటున్నారు. అందుకే బాలయ్య ఒక ప్లాన్ వేశారు.

 బాలయ్య...చక్కటి ప్లాన్

బాలయ్య...చక్కటి ప్లాన్

సినీ హీరోగా బాగా బిజీగా ఉండటంతో సహజంగానే నియోజకవర్గం ప్రజలకు బాలకృష్ణ అందుబాటులో ఉండటం కష్టమయ్యేది. ఆ క్రమంలో అప్పట్లో బాలయ్యకి పీఏగా ఉన్న శేఖర్‌ అంతా తానై వ్యవహరిస్తున్నారంటూ అతడి వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను తప్పించి మరొకరిని పెట్టినా పరిస్థితిలో కొంత మెరుగేగాని అంతగా ప్రయోజనం సిద్దించలేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో ఈ పరిస్థితి మంచిది కాదని అంచనా వేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...ప్రజల్లో తన పట్ల ఉన్న ఏమైనా ప్రతికూలమైన అభిప్రాయాలు ఉంటే వాటిని సానుకూలంగా మార్చేందుకు చక్కటి ప్లాన్ వేశారు.

 సినిమాలు పక్కనబెట్టి...ప్రజల్లోకి

సినిమాలు పక్కనబెట్టి...ప్రజల్లోకి

ప్రజల్లో తనపై ఏమైనా అపోహలు, అపార్థాలు ఉంటే వాటిని తొలగించడానికి...అసలు తానేంటో...ఎలా ఉంటానో తెలియచెప్పడానికి బాలయ్య తన నియోజకవర్గం ప్రజలతో నేరుగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకోవడమే కాదు దాన్ని విజయవంతంగా ఆచరణలో పెడుతూ సత్ఫలితాలు రాబడుతున్నారు. అంతేకాదు పల్లెల్లో ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు తెలుసుకోవడానికి ఏకంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. సినిమాలు, ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలు వింటున్నారు.

 సానుకూలతలు...సత్ఫలితాలు

సానుకూలతలు...సత్ఫలితాలు

ఈ క్రమంలో గత వారంలో రెండు రోజులపాటు బాలయ్య పల్లెనిద్ర చేశారు. తన దైనందిన జీవితంపై...తన ప్రవర్తనా శైలిపై ప్రజల్లో ఒక అవగాహన కలిగేలా ఆయన తన కార్యక్రమాల అమలు చేపట్టారు. బాలయ్యను ఎక్కువ సమయం దగ్గరి నుంచి చూసిన స్థానిక ప్రజలకు ఆయనపై అభిమానం మరింత పెరిగింది.ప్రతికూలంగా ఆలోచించిన వారు సైతం బాలయ్య పట్ల అపార్థాలు తొలగించుకుంటున్నారు. అంతేకాదు అంతకుముందు బాలయ్య వస్తున్నారంటే నియోజకవర్గ ముఖ్య నేతలంతా ఆయన వెంట ఉంటుంటారు. అయితే ఈసారి పంథాను మార్చారు. జిల్లా నేతలు కానీ.. స్థానిక నియోజకవర్గ నేతలు కానీ తన వెంట లేకుండా ఆయన జాగ్రత్తపడ్డారు.
ఆయా గ్రామ నేతలను వెంటబెట్టుకుని వారినే వేదికల మీదకు ఎక్కించి మాట్లాడించారు. దీంతో స్థానిక నేతలకు బాలయ్య మరింత చేరువయ్యారనే అభిప్రాయం ఏర్పడింది.

కోపం గురించి అపార్థం...ఇప్పుడు అర్థం

కోపం గురించి అపార్థం...ఇప్పుడు అర్థం

బాలయ్యకి బాగా కోపమెక్కువ అనే అపోహలు కొందరు కావాలని ప్రచారం చేశారని, దీనివల్ల కొందరిలో ఆ భావన ఉందని తెలుసుకున్న బాలయ్య ఈసారి తన ఓపికని ప్రదర్శించారు. ప్రతీ ఒక్కరు చెప్పే విషయాలను ఆసాంతం సావధానంగా విన్నారు. ప్రజలు తన దృష్టికి తెచ్చే సమస్యలపై ఆయన వెంటనే స్పందించారు. ఆయా సమస్యలను పరిష్కారించమని అధికారులకు ఆదేశించారు. అలాగే రాజకీయాల్లో గ్రూప్ రాజకీయాలు సహజం కాగా బాలకృష్ణ వాటి ప్రభావం తనపై పడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తూ నొప్పించక తానొవ్వక అనే రీతిలో చాలా నేర్పుగా ఇటు నియోజకవర్గం ప్రజలను...అటు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

అక్కడ...ప్రత్యేక దృష్టిం:ఫలవంతం

అక్కడ...ప్రత్యేక దృష్టిం:ఫలవంతం

ఇక గత ఎన్నికల్లో బాలకృష్ణకు చిలమత్తూరు మండలంలో తక్కువ మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని మెరుగుపర్చేందుకు...అక్కడి స్థానికులను మరింత దగ్గర అయ్యేందుకు బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చాగలేరు గ్రామంలో దళితవాడలో సామూహిక సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అంతేకాదు తానే స్వయంగా అన చేత్తో ఒక మహిళకు భోజనం తినిపించారు. సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ మొదటి రోజు బిజీగా గడిపారు. అదే రోజు దిగువల్లి తాండాలో ఒక ఇంట్లో పల్లెనిద్ర చేశారు. తెల్లవారు జామున లేచి అక్కడే త్రెడ్ మిల్‌పై వ్యాయమం చేశారు. ఉదయం మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. రెండవ రోజు ఇదే మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. వీరాపురంలో పల్లెనిద్ర చేశారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ప్రతికూలతను సానుకూలంగా మల్చుకోవడంలో రాజకీయనాయకుల కన్నా బాలయ్య ఒకడుగు ముందే ఉన్నారని పార్టీ శ్రేణులు మురిసిపోతున్నాయి.

English summary
Nandamuri Balakrishna ...The familiar top telugu hero and now Hindupuram MLA also. but there is negative image he got from his constituency people because of not availabulity. For that Balakrishna is applying a successful plan to erase bad image.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X