వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స‌త్తెన ప‌ల్లిలో స‌డెన్ బ్రేకులు..! ఇక అంబ‌టి రాంబాబు దారెటు..?

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైద‌రాబాద్ : వైసీపీ అంటే తానే అనుకుంటాడు. జ‌గ‌న్‌కు కుడిభుజ‌మ‌ని భావిస్తాడు. ఆనాడు వైఎస్ హ‌యాంలో చ‌క్రం తిప్పిన‌ట్టు మ‌రోసారి అధికారం అనుభ‌వించాల‌నే ఆరాటం. అస‌లు పార్టీ అధినేత ఆయ‌న‌కు అంత సినిమా ఇస్తాడో లేదో తెలియ‌దు గాని మ‌నోడు మాత్రం ఆస్కార్ రేంజ్ లో రెచ్చిపోతుంటాడు. ఆయ‌నే అంబ‌టి రాంబాబు. జేబులో దువ్వెన‌.. ఫాన్ గాలికి చెద‌రని క్రాఫ్‌తో మీడియాలో మాట్లాడాలంటే అంబ‌టే అనేంత‌గా పేరు సంపాదించాడు. కానీ ఓ మ‌హిళా నేత‌తో అస‌భ్య‌క‌ర‌మైన సెల్ ఫోన్ లో అస‌భ్య‌క‌రంగా మాట్లాడి అడ్డంగా దొరికి కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యే ప‌నిలో ప‌డ్డారు. అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే స‌త్తెన‌ప‌ల్లి నుంచి మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని భావించారు.

Sudden breaks for Ambati Rambabu in Sattenapally..! which rout he may have..?

ఇదిలా ఉండ‌గా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి రూపంలో అంబ‌టి రాంబాబుకు శ‌రాఘాతం ఎదురైంది. అంతే కాదు సొంత‌గూటిలో పోటీ అనే కుంప‌టి మొద‌లైంది. దీంతో అటు కక్క‌లేక‌, ఇటు మింగ‌లేక‌, మ‌రో నియోజ‌క‌వ‌ర్గం వెతుక్కునే ప‌నిలో ప‌డ్డార‌ట అంబ‌టి రాంబాబు. గ‌త ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి బ‌రిలోకి దిగిన అంబ‌టి రాంబాబు స్వ‌ల్ప ఓట్ల తేడాతో కోడెల శివ‌ప్ర‌సాద్‌పై ఓట‌మి చ‌విచూశారు. స్థానికంగా స్వ‌యంకృతాప‌రాధం వ‌ల్ల‌నే అంబ‌టి ఓట‌మి చెందార‌నే విమ‌ర్శ‌లూ లేక‌పోలేదు. మ‌రోసారి అద్రుష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు నాలుగేళ్లుగా స‌త్తెన‌ప‌ల్లిలో ఉంటున్నారు. కానీ ఇటీవ‌ల టీడీపీని వీడిన మోదుగుల‌కు పార్టీ అదిష్ఠానం స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఖ‌రారు చేసింది. దీంతో అంబ‌టి రాంబాబు ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది.

English summary
In the last election, Ambati Rambabu lost from Sattenappalli to defeat Kodela Shivaprasad with a slight margin. Once again, he has been in Satanapalli for four years to test his innocence. But the party has recently resolved the Sattenapalli constituency in the upkeep of the takers. Ambati Rambabu's situation has become disorganized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X