వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చెయ్యండి; విడదల రజిని ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ కలెక్టర్లకు మార్గదర్శకాలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను గాడిలో పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని భావిస్తున్నారు. గత కొంత కాలంగా ఆసుపత్రులలో జరుగుతున్న సంఘటనలపై వస్తున్న వరుస విమర్శల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు రంగంలోకి దిగారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి విడదల రజిని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు.. కలెక్టర్ లకు మార్గదర్శకాలు

ప్రభుత్వ ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు.. కలెక్టర్ లకు మార్గదర్శకాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు జరపాలని, అప్పుడే ఆస్పత్రులలో వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కలెక్టర్లకు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలపై మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు స్పందించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు పేర్కొన్నారు. అధికారులు ఆయా వార్తలకు స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని తెలిపారు.

నిరుపేదలకు వైద్యం సక్రమంగా అందుతుందో లేదో చూడాల్సిన బాధ్యత అధికారులదే

నిరుపేదలకు వైద్యం సక్రమంగా అందుతుందో లేదో చూడాల్సిన బాధ్యత అధికారులదే


పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని చెప్పిన కృష్ణ బాబు, నిరు పేదలకు సక్రమంగా వైద్యం అందుతుందో లేదో చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఆసుపత్రులలో అధునాతన పరికరాల కొనుగోలు, వాటి నిర్వహణ ను ఏ పీ ఎం ఎస్ ఐ డి సి పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో పీహెచ్సీల నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్ని బయోమెడికల్ పరికరాల నిర్వహణను కాంట్రాక్టు పద్ధతిలో చేపడుతున్నట్టు కృష్ణబాబు తెలిపారు.

 ప్రైవేట్ వాహనాల మాఫియానుఅడ్డుకోవటానికి చెయ్యాల్సింది ఇదే

ప్రైవేట్ వాహనాల మాఫియానుఅడ్డుకోవటానికి చెయ్యాల్సింది ఇదే

ఇక ప్రైవేటు వాహనాల మాఫియాను అడ్డుకోవడంతో పాటు స్థానిక ఆపరేటర్లతో చర్చించి వాహనాల రేట్లను అందరికీ తెలిసేలా ఆర్డీవో, డిఎస్పీ లతో కూడిన కమిటీల నిర్ణయంతో బోర్డులు ఏర్పాటు చేయించాలని కలెక్టర్ లకు కృష్ణ బాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అదనంగా కావలసిన మహాప్రస్థానం వాహనాల విషయాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతామని వెల్లడించారు.ఆసుపత్రులలో మందులు, బయోమెట్రిక్ హాజరు, సిబ్బంది నియామకం, మహాప్రస్థానం వాహనాలు, శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఆరా తీసి తగిన ఆదేశాలను జారీ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో నిరుపేదలకు వైద్యం అందేలా చూడాలని కృష్ణ బాబు పేర్కొన్నారు.

ఆస్పత్రుల పనితీరుపై ఆకస్మిక తనిఖీలు.. మంత్రి విడదల రజిని ఆదేశాలతోనే

ఆస్పత్రుల పనితీరుపై ఆకస్మిక తనిఖీలు.. మంత్రి విడదల రజిని ఆదేశాలతోనే

కృష్ణ బాబు ఆదేశాలతో ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. ఇప్పటికే మంత్రి విడదల రజిని రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఏపీ ని తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు విడదల రజిని. ఆస్పత్రులలో ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని, త్వరలోనే తానూ రంగంలోకి దిగుతానని చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీలో ప్రభుత్వాసుపత్రుల ప్రక్షాళనకు ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నారు.

English summary
Medical Health Chief Secretary MT Krishna Babu has directed the district collectors with the directions of minister vidadala rajini to constantly monitor the performance of staff in state government hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X