వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుధాకర్ ట్రీట్‌మెంట్‌పై సందేహాలు, పిచ్చి ఉంది అనే ముద్ర వేసే యత్నం: లాయర్ శ్రావణ్

|
Google Oneindia TeluguNews

డాక్టర్‌ సుధాకర్‌కు అందిస్తోన్న వైద్యంపై అనుమానాలు ఉన్నాయని అతని తరపు లాయర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ అన్నారు. సుధాకర్‌‌కు పిచ్చి ఉంది అనే ముద్ర వేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన క్లైయింట్‌ను ఎందుకు మెంటల్ ఆస్పత్రికి తరలించారని ప్రశ్నించారు. అంతేకాదు సుధాకర్‌కు ప్రాణహాని ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు.

sudhakar lawyer suspicious on his treatment

సుధాకర్ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారని.. కానీ రాష్ట్రంలో అతనికి రక్షణ లేదని శ్రావణ్ కుమార్ తెలిపారు. విశాఖపట్టణం మెంటల్ ఆస్పత్రిలో తనకు సరిగా వైద్యం అందడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుధాకర్. తనను ఇక్కడినుంచి వేరే ఆస్పత్రికి తరలించాలని కోరారు. అంతేకాదు కోర్టు పర్యవేక్షణలో చికిత్స అందజేయాలని విన్నవించారు. తనకు ప్రభుత్వం సరైన ట్రీట్ మెంట్ ఇవ్వడం లేదని.. ట్యాబ్లెట్ల వివరాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. డాక్టర్లు ఇస్తున్న మాత్రలతోసైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Recommended Video

5 Year Old Travels Alone In Flight From Delhi To Bengaluru, Reunion With Mother

మరోవైపు డాక్టర్ సుధాకర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని తల్లి కావేరి బాయి నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుధాకర్ ఆరోగ్యంగా ఉన్నాడని.. కానీ మానసిక రోగి అని ముద్రవేస్తున్నారని ఆరోపించారు. మెంటల్ ఆస్పత్రిలో పెట్టడం వల్ల నిరసించిపోయాడని గుర్తుచేశారు. ఓ డాక్టర్‌పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని కావేరిబాయి అన్నారు. సుధాకర్ చేసిన తప్పు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. ఎన్ 95 మాస్క్‌లు లేవని అంటే అరెస్ట్ చేసి.. మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారా అని నిలదీశారు.

English summary
sudhakar lawyer suspicious on his treatment in vizag mental hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X