వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలోకి టిడిపి నేత రాంబొట్ల: పవన్‌కు బాబు పిలుపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sudhish Rambhotla resigns
హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన సుధీష్ రాంబొట్ల పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 4వ తేదీననే టిడిపి రాష్ట్ర కార్యాలయానికి తన రాజీనామా పత్రాన్ని పంపించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో రెండు, మూడు రోజులలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారని సమాచారం.

రాష్ట్ర విభజన అనివార్యం అయితే, హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిని చేయాలన్న డిమాండ్‌తో రాంబొట్ల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టిడిపికి భవిష్యత్ ఉండదన్న అంచనాతో రాంబొట్ల బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, సోమవారం సుధీష్ రాంబోట్ల... చంద్రబాబు కోటరీ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు కోటరీ వారి అడుగులకు మడుగులొత్తుతేనే ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. బాబు కోటరీ సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

పవన్, కిరణ్‌లకు బాబు పిలుపు

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కిరణ్ పార్టీకి ఓటేస్తే మురిగిపోయినట్లేనని చెప్పిన చంద్రబాబు... తెలుగు ప్రజల కోసం నిజంగా పోరాడాలనుకుంటే టిడిపికి మద్దతివ్వాలన్నారు.

కిరణ్ అయినా, మరెవ్వరైనా కొత్త పార్టీ పెట్టే వారికి సీమాంధ్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే టిడిపికి మద్దతివ్వాలన్నారు. కిరణ్‌ సిఎంగా ఉండే ఏం చేయలేని వ్యక్తి, ఇక పార్టీ పెట్టి ఐదారు సీట్లు గెలుచుకొని ఏం చేయగలరు? ఆయనకు ఉద్యోగం తప్ప మరేమీ ప్రయోజనం లేదు అని చంద్రబాబు ఏద్దేవా చేశారు. సీమాంధ్రలో టిడిపికి వన్‌సైడ్‌గా ఓట్లు వేసి, పూర్తి మేజారిటీ ఇచ్చి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైనపుడే శరవేగంగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని బాబు అన్నారు.

English summary
Telugudesam Party senior leader Sudhish Rambhotla resigned to TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X