వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ ఎఫెక్ట్: ఎంతో కాలం మోసం చేయలేరు,అరుణ్ జైట్లీతో సుజనా వాగ్వాదం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Sujana Chowdary Argument with Arun Jaitley

అమరావతి: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి గురువారం సాయంత్రం వాగ్వాదానికి దిగారు. గురువారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంపై ఆగ్రహంతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజ్యసభ లాబీల్లోనే వాగ్వావాదినికి దిగారు. ఏపీ ప్రజలకు తాము ముఖం చూపుకొనే పరిస్థితి లేకుండా చేశారని జైట్లీపై సుజనా చౌదరి ప్రశ్నించారు.

అంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలుఅంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఏపీ రాష్ట్రానికి వరాలు ప్రకటిస్తారని టిడిపి ఎంపీలు భావించారు. కానీ, ఎంపీల ఆశకు నిరాశే మిగిలింది. పాత ప్రసంగాన్నే జైట్లీ వల్లే వేశారని టిడిపి ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిత్రులుగా కొనసాగలేం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వైసీపీ ఉందనుకొంటున్నారా?: గల్లా సంచలనంమిత్రులుగా కొనసాగలేం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వైసీపీ ఉందనుకొంటున్నారా?: గల్లా సంచలనం

రాజకీయ సమీకరణాలు మారుతాయి, బాబుపై ఈసీకి ఫిర్యాదు: మేకపాటి సంచలనంరాజకీయ సమీకరణాలు మారుతాయి, బాబుపై ఈసీకి ఫిర్యాదు: మేకపాటి సంచలనం

నాలుగు రోజులుగా ఏపీకి చెందిన ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ, కేంద్రప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు లేవని టిడిపి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.

అరుణ్ జైట్లీతో సుజనా చౌదరి వాగ్వాదం

అరుణ్ జైట్లీతో సుజనా చౌదరి వాగ్వాదం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మరో కేంద్ర మంత్రి సుజనాచౌదరి వాగ్వాదానికి దిగారు. లో‌క్‌సభలో జైట్లీ ప్రసంగం తర్వాత రాజ్యసభ లాబీల్లో జైట్లీతో సుజనాచౌదరి వాగ్వాదానికి దిగారు. ఏపీకి న్యాయం చేయకపోవడంపై సుజనా చౌదరి జైట్లీకి మరోసారి వివరించారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాల్సిన అంశాన్ని సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ వద్ద ప్రస్తావించారు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వావాదం చోటు చేసుకొంది.

ఎందుకు సంతృప్తి చెందడం లేదు

ఎందుకు సంతృప్తి చెందడం లేదు

ఏపీకి ఇచ్చిన హమీల విషయమై తాము ఇప్పటికే ఏపీకి సాయంపై ప్రకటన చేసినప్పటికీ ఎందుకు సంతృప్తి లేదని జైట్లీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ప్రశ్నించారని సమాచారం. అయితే ఏపీకి న్యాయం జరగలేదని సుజనా చౌదరి బదులిచ్చారు. ప్రజలను ఎంత కాలం మోసం చేయలేమంటూ సుజనా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

రాజకీయపార్టీలకు విలువ ఇవ్వాలి

రాజకీయపార్టీలకు విలువ ఇవ్వాలి


ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన విషయమై కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద నొక్కిచెప్పారు. ప్రభుత్వం శాశ్వతం కానీ... రాజకీయ పార్టీలు కాదని సుజనా చౌదరి గుర్తు చేశారు. పార్టీలకు విలువ ఇవ్వాలి కానీ... సభ్యులకు కాదని సుజనా చౌదరి కేంద్ర మంత్రి జైట్లీ వద్ద ప్రస్తావించారు.

ప్రజలకు ముఖం ఎలా చూపాలి

ప్రజలకు ముఖం ఎలా చూపాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేసే పరిస్థితి కన్పించడం లేదని టిడిపి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్ష పార్టీలకు చెందిన ఎంపీల నిరసనలు వ్యక్తం చేస్తున్నా కానీ, బిజెపి నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో టిడిపి ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ముఖం ఎలా చూపాలని టిడిపి ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.

English summary
TDP MP and Union Minister MP Sujana Chowdary, who is upset with Finance Minister Arun Jaitley's statement regarding Andhra Pradesh in the Parliament, has confronted with Jaitley
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X