వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంతకీ నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా గుర్తించారా ? నన్ను కలిస్తే భయమెందుకు ... సుజనా లాజిక్స్

|
Google Oneindia TeluguNews

నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ లతో రహస్య భేటీ నిర్వహించారని సోషల్ మీడియాలో వైరల్ ఐన వీడియోలతో దుమారం రేగింది. ఇక దీనిపై సుజనాచౌదరి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కామినేని శ్రీనివాస్,నిమ్మగడ్డ రమేష్ కుమార్ లతో రెండు వేర్వేరు సమావేశాలని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో తన కుటుంబస్నేహం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సుజనాచౌదరి సోషల్ మీడియా వేదికగా లాజిక్స్ కూడా మాట్లాడారు.

ఆయనను మీరు కమిషనర్ గా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా

ఆయనను మీరు కమిషనర్ గా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా

రమేష్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుండి తొలగిస్తున్నామని మీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా వుండి ఎంపీని కలవడంలో మతలబు ఏంటి అని మీ మీడియా ఆశ్చర్యపోతుంది. ఇంతకీ ఆయనను మీరు కమిషనర్ గా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా? అంటూ ఎంపీ సుజనాచౌదరి లాజికల్ ప్రశ్నలు వేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా గుర్తించటం లేదు అనేది వైసిపి ప్రభుత్వ వాదన.

నన్ను కలిస్తేనే నానా హైరానా పడుతున్నారు ఎందుకు ?

నన్ను కలిస్తేనే నానా హైరానా పడుతున్నారు ఎందుకు ?

ఇక అలాంటి సమయంలో ఎన్నికల కమిషనర్ గా ఉండి ఎంపిని కలవడంలో మతలబేంటి అని వైసిపి నాయకులు ప్రశ్నించడం సరైనదేనా అన్నది సుజనా చౌదరి వాదన.ఇక ఈ క్రమంలోనే కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూ, వైసిపి నాయకులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా గుర్తిస్తున్నారా అంటూ సుజనా చౌదరి ప్రశ్నించారు. ఇక మరో ట్వీట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామినేని శ్రీనివాస్ పార్క్ హయత్ లోని నా కార్యాలయానికి వచ్చినందుకే నానా హైరానా పడుతున్నారు. మేం కలిస్తే తప్పేంటి? మీకు అంత భయం దేనికి?అని ప్రశ్నించారు.

పారదర్శక రాజకీయాలు చేస్తా ..

పారదర్శక రాజకీయాలు చేస్తా ..

కంగారొద్దు. నా రాజకీయాలు పారదర్శకంగా ఉంటాయి .నేను ఏదైనా చెప్పే చేస్తా అంటూ తను ఏం చేసినా చెప్పే చేస్తానని,రహస్య సమావేశాలు నిర్వహించవలసిన అవసరం తనకు లేదని రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి పేర్కొన్నారు. ఇక దీనితో పాటుగా మేం కలిస్తే తప్పేంటి, మీకు అంత భయం దేనికి అంటూ వైసిపి నేతలను ప్రశ్నించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.

చట్టవ్యతిరేక సమావేశాలు కాదన్న సుజనా

చట్టవ్యతిరేక సమావేశాలు కాదన్న సుజనా

హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్ వేదికగా నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లతో ఈనెల 13న రహస్యమేమిటి నిర్వహించారని, వైసీపీ ప్రభుత్వం మీద కుట్రలు చేశారని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ద్వారా ఆరోపణలు గుప్పించిన వైసీపీ నేతలకు సుజనా చౌదరి సమాధానమిచ్చారు. వైసిపి అసలు ఎందుకు భయపెడుతోంది అంటూ ప్రశ్నించారు .తనపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం మంచిది కాదని, తాను పారదర్శకంగా వ్యవహరించే వ్యక్తిని అని సుజనా పేర్కొన్నారు. చట్టవ్యతిరేక సమావేశాలు తామేమీ నిర్వహించలేదని తేల్చి చెప్పారు.

English summary
BJP MP Sujana Chowdary said nimmagadda is his family friend . To this end, Sujana Chowdary also spoke of logics as a social media platform. They questioned the leaders of the YCP why they are in fear ?are they recognise him as election commissioner
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X