అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీతో సహా అన్నిపార్టీలు పొత్తు కోసం: ఎంపీలు..ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు : సుజనా చౌదరి..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార వైపీపీలో అధికార వైసీపీ సహా ముఖ్యమైన పార్టీలు బీజేపీతో కలిసి నడవటానికి సిద్దంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. అదే విధంగా టీడీపీ..వైసీపీ నుండి ఎంపీలు.. ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ను చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసారు. జేరూసెలం కు ఆర్దిక సాయం అందించిన ప్రభుత్వం అమర్నాధ్ యాత్రకు ఎందుకు ఇవ్వలేదంటే ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఆరు నెలల కాలంలో ఒక్క పరిశ్రమ రాలేదని.. రివర్స్ పాలన జరుగుతుందని విమర్శించారు. 22 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా గురించి ెందుకు మాట్లాడటం లేదని సుజనా నిలదీసారు.

బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాట..

బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాట..

ఏపీలో వైసీపీతో సహా ప్రధాన పార్టీలు తమత పొత్తు కోసం వెంపర్లాడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా వైసీపీ నుండి కూడా ఎంపీలు..ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇంగ్లీషు మీడియం పై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదుని వ్యాఖ్యానించారు. ఇంగ్లీషు చెప్పగలిగిన ఉపాధ్యాయులు ..ఇతర వసతులు కల్పించకా నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలుగు మీడియం లో చెప్పే ఉపాధ్యాయులు ఇంగ్లీష్ లో బోధించగలరా అని సుజనా ప్రశ్నించారు. ఈ నిర్ణయం తో రెండు,మూడు జెనరేషనలకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. వెంకయ్యనాయుడు లాంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తెలుగు భాషను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం..చేస్తుంటే మాతృభాషను కాపాడాలని కేంద్రం చూస్తుందని వివరించారు.

పాలనపైన దృష్టి పెట్టటం లేదు..

పాలనపైన దృష్టి పెట్టటం లేదు..

ఏపీలో ఎన్నికలు అయిపోయి ఇన్ని నెలలు అవుతున్నా..రాష్ట్ర ప్రభుత్వం పాలన పై దృష్టిపెట్టకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎంతసేపు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు వాడే భాష సరిగ్గా లేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం, వైసీపీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. అదే విధంగా..వైసీపీ ప్రభుత్వం నిద్రపోతున్నట్లు నటిస్తుందని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్కటైన పరిశ్రమ వచ్చిందా అని ప్రశ్నిస్తూనే..200 కిలో మీటర్ల వేగంతో వెనక్కి వెళ్లిపోయే స్థితికి వచ్చిందన్నారు. సీఎస్ ని అంత అవమానకరంగా బయటకు పెంపిస్తే ఒక్క బ్యూరోకట్ స్పందించలేదని గుర్తు చేసారు.

జెరూసలేంకు నిధులిచ్చారు..అమర్నాధ్ యాత్రకు

జెరూసలేంకు నిధులిచ్చారు..అమర్నాధ్ యాత్రకు

ఏపీ ప్రభుత్వం జెరూసలేంకు నిధులిచ్చిందని..మరి అమర్నాధ్ యాత్రకు నిధులు ఇవ్వరా అంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు . జెరూసలేం, మక్కా వెళ్లేందుకు రాయితీలు ఇవ్వడం సరికాదన్నారు. .ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులను వినియోగించే అధికారం ఎవరు ఇచ్చారని నిలదీసారు. రేపు హిందూ దేవాలయాలకు వెళ్లేందుకు అడిగితే వారికి ఇస్తారా అని ప్రశ్నించారు. కావాలంటే స్పిరిచువాల్ టూరిజాన్ని ప్రోత్సహించండని సూచించారు. టీటీడీ యాక్ట్ ని ఉల్లంగిస్తూ ఆ నిధులను ఇతర పనులకు వినియోగించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ల్యాండ్ లను అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకోవడం సరికాదని సుజనా పేర్కొన్నారు.

కృష్ణా రివర్ బోర్డ్ ని ఏపీ కి తీసుకురావడం లో

కృష్ణా రివర్ బోర్డ్ ని ఏపీ కి తీసుకురావడం లో

గతంలో పని చేసిన అధికారులు ఇప్పుడు ఎమ్ చేస్తున్నారో అర్థం కావట్లేదన్న సుజనా.. కృష్ణా రివర్ బోర్డ్ ని ఏపీ కి తీసుకురావడం లో ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. నిధులు లేకపోతే ఎంపీ నిధుల నుంచి డబ్బులు ఇచ్చేందుకు తాను సిద్దమన్నారు. కేంద్రం అన్ని అంశాలను పరిశీలిస్తోందని.. పోలవరం పై లెక్కలు చెప్తేనే రావాల్సిన 1800 కోట్లు వస్తాయని స్పష్టం చేసారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల పై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో చర్చించానన్నారు. రాజు మారగానే రాజధాని మార్చడం సరికాదని...ఇంకా అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించలేదని...ప్రకటిస్తే అప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లలో కలల రాజధానిగా ఉండేదని..చంద్రబాబు విజన్ అమలులో విఫలమైందన్నారు. అందుకే 5 ఏళ్ళు వృధా అయ్యాయని..అది మన దురదృష్ట మంటూ సుజనా వ్యాఖ్యానించారు.

English summary
ex Central minister Sujana Chowdaray revieled that key parties from AP including YCP is in touch with BJP for alliance. He says Many MP's and MLA's in touch with him for party change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X