వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి సుజనా షాక్ ఇస్తారా? జ‌గ‌న్ కేసులపై యూటర్న్.. ఆయన తెలివితోనే సంపాదించారు..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియ‌ర్ నేత‌..అధినేత చంద్ర‌బాబు అత్యంత స‌న్నిహితుడు అయిన సుజ‌నా చౌదరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. గత అయిదేళ్ల కాలంలో ప్ర‌భుత్వంలో అంచనాల‌ను త‌గిన‌ట్లుగా పాల‌న చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న ప్ర‌ధాని మోదీ గురించి..ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైనా సానుకూల వ్యాఖ్య‌లు చేసారు. టీడీపీ వీడ‌ను అంటూనే బీజేపీలోకి వెళ్తే చంద్ర‌బాబుకు చెప్పే వెళ్తాన‌ని స్ప‌ష్టం చేసారు. చంద్ర‌బాబు ఏపీలో ఉనికి లేని పార్టీకి ద‌గ్గ‌ర‌వ్వ‌టం.. అదే స‌మ‌యంలో ఉనికిలేని మ‌రో పార్టీతో యుద్దం చేయ‌టంతోనే టీడీపీకి ఈ ఖ‌ర్మ ప‌ట్టింద‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబును కొంత మంది త‌ప్పుదారి ప‌ట్టించార‌ని..వ్య‌క్తుల కంటే మిష‌న్ల‌ను న‌మ్మారంటూ చెప్పుకొచ్చారు.

సుజ‌నా చౌద‌రి రూటెటు..

సుజ‌నా చౌద‌రి రూటెటు..

టీడీపీ సీనియ‌ర్ నేత‌..చంద్ర‌బాబు కోట‌రీ ముఖ్యుడు ఇక టీవీ ఛాన‌ల్‌లో చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఆయ‌న..టీడీపీ వీడి బీజేపీలోకి వెళ్తున్నార‌నే దాని పైన ఎక్క‌డా ఆయ‌న ఖండించ‌లేదు. వెళ్లే ప‌రిస్థితి రాద‌ని చెప్పలేక పోయిన ఆయ‌న‌..వెళ్లాల్సి వ‌స్తే మాత్రం ఖ‌చ్చితంగా చంద్ర‌బాబుకు చెప్పే వెళ్తాన‌ని స్ప‌ష్టం చేసారు. గ‌త అయిదేళ్ల కాలంలో ఆశించిన స్థాయిలో పాల‌న జ‌ర‌గ‌లేద‌నే విష‌యాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. కొంత మంది ఎమ్మెల్యేల మీద ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు వ‌చ్చినా..చంద్ర‌బాబు వారికే తిరిగి పోటీకి దించ‌టం సైతం న‌ష్టం చేసింద‌ని చెప్పారు. త‌న‌ను న‌మ్మిన వ్య‌క్తుల కంటే..అధికారులు-ఐవీఆర్‌య‌స్ స‌ర్వేలు..మిష‌న్లు చెప్పిన వాటిని ఆయ‌న ఎక్కువ‌గా న‌మ్మార‌ని ప‌రోక్షంగా త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. చంద్ర‌బాబును కొంద‌రు త‌ప్పు దోవ ప‌ట్టించార‌ని కీల‌క వ్యాఖ్య చేసారు. ఇవిఎంల్లో త‌ప్పు జ‌రిగే అవ‌కాశం లేద‌న్నారు.

జ‌గ‌న్ తెలివితోనే సంపాదించారు..

జ‌గ‌న్ తెలివితోనే సంపాదించారు..

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న పైన కేసుల గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావించి రాజ‌కీయాలు చేయ‌టం స‌రి కాద‌నే అభిప్రాయం తాను అప్పుడే వ్య‌క్తం చేసానన్నారు. జ‌గ‌న్ త‌న తెలివి తేట‌ల‌తోనే సంపాదించుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ కేంద్రంతో స‌రైన దారిలో వెళ్తున్నార‌ని.. ఆయ‌న కేంద్రంతో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును సుజ‌నా చౌద‌రి స‌మ‌ర్దించారు. ప్ర‌ధాని మోదీ పైన అనుకూల వ్యాఖ్య‌లు చేసారు. ఆయ‌న ఆలోచ‌న తీరును స‌మ‌ర్ధించారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ..ప‌వ‌న్ క‌ళ్యాన్ కార‌ణంగానే త‌మ విజ‌యం సులువు అయింద‌ని చెప్పుకొచ్చారు. నాడు ప‌వ‌న్ సైతం హుందాగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పారు. తాము ప్ర‌భుత్వంలో .. రాజ‌కీయ నిర్ణ‌యాల్లో లోపాలు పైన అనేక సార్లు అధినేత దృష్టికి తీసుకెళ్లామ‌ని వివ‌రించారు.

టీడీపీకి అందుకే ఈ గ‌తి ప‌ట్టింది..

టీడీపీకి అందుకే ఈ గ‌తి ప‌ట్టింది..

తాము కేంద్ర ప్ర‌భుత్వం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో కొన్ని సూచ‌న‌లు చేసిన విష‌యాన్ని సుజ‌నా చౌద‌రి బ‌య‌ట పెట్టారు. కేంద్ర ప్ర‌భుత్వం నుండి బ‌ట‌య‌కు వ‌ద్దామ‌ని..అయితే, ఎన్డీఏ లో మాత్రం కొన‌సాగుదామ‌ని చెప్పినా విన‌లేద‌న్నారు. ఇక‌, ఏపీలో ఏ మాత్రం ఉనికి లేని కాంగ్రెస్‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌టం..ఏ మాత్రం ఉనికి లేని బీజేపీతో యుద్దం చేయ‌టం వ‌ల‌నే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఈ గ‌తి ప‌ట్టింద‌న్నారు. తాజా ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉంటే ఖాయంగా గెలిచేవాళ్ల‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరు సైతం ఓటమికి ఒక కార‌ణంగా పేర్కొన్నారు. లోకేశ్ మంగ‌ళ‌గిరి నుండి పోటీ చేయ‌టం స‌రి కాద‌న్నారు. ఆది బీసీ సీటు అని చెప్పుకొచ్చారు.
ఏపీలో బీజేపీని దెబ్బ కొట్టామ‌ని..మ‌న‌మూ దెబ్బ తిన్నామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఇక‌, విమానాశ్ర‌యంలో చంద్ర‌బాబు త‌నిఖీల‌ను ఇష్యూ చేయ‌టం స‌రి కాద‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌తో సుజ‌నా చౌద‌రి టీడీపీ వీడి బీజేపీలోకి వెళ్ల‌టం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

English summary
TDP Senior leader Sujana Chowdary sensational comments on TDp defeat in AP. He positively respond on Jagan and Modi. Chowdary said Lokesh may not contest from Mangalagiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X