అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఓపికకు జోహార్లు, 25ఎంపీలు గెలిస్తే..: మహానాడులో సుజనా చౌదరి

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే దేశానికి మంచిదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. మహానాడులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అసమర్థతను టీడీపీ ఎత్తిచూపిందని అన్నారు.

నారా భువనేశ్వరికి భయం, దళితులు, బీసీలు జడ్జీలు కాకుండా.: బాబుపై మోత్కుపల్లి సంచలనంనారా భువనేశ్వరికి భయం, దళితులు, బీసీలు జడ్జీలు కాకుండా.: బాబుపై మోత్కుపల్లి సంచలనం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓపికకు జోహార్లు అని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం ఓపిక పట్టాలని చంద్రబాబు పదే పదే కోరారని తెలిపారు. కేంద్రం పేపర్ మీద చెప్పినవన్నీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదని అన్నారు. సెప్టెంబర్ 2016లో స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామన్న కేంద్రం మాట తప్పిందన్నారు.

Sujana Chowdary takes on at Centre and BJP

అనేక లోపాలతో విభజన బిల్లు తీసుకొచ్చారని, సవరణ చేసే అవకాశం ఉన్నా కేంద్రం చేయడం లేదని సుజనా చౌదరి అన్నారు. పార్లమెంటు చట్టం చేస్తే కేంద్రం అమలు చేయాలని, అయితే అదీ కూడా చేయడం లేదని అన్నారు. తెలంగాణకు ఆస్తులు ఇచ్చి.. ఏపీకి అప్పులు ఇచ్చారని ఆరోపించారు.

బాబూ! ఏపీ ప్రజలు బొందపెడతారు, ఎన్టీఆర్‌ను చంపి..: మోత్కుపల్లిబాబూ! ఏపీ ప్రజలు బొందపెడతారు, ఎన్టీఆర్‌ను చంపి..: మోత్కుపల్లి

80శాతం హామీలు నెరవేర్చామని బీజేపీ చెప్పుకుంటోందని, అయితే, తెలుగుదేశం పార్టీ పోరాటంతోనే కొంత సాధించామని సుజనా చెప్పారు. 2019లో కేంద్రం అన్యాయాన్ని గమనించి ఓటేయ్యాలని అన్నారు. 25మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే దేశంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు లేవని, బీజేపీకి కూడా అంతే కానీ, టీడీపీ ఫుణ్యమా అని కొన్ని సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలని అన్నారు.

English summary
TDP MP Sujana Chowdary takes on at Centre and BJP for andhra Pradesh issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X