వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి, ఏపి సిఎంలు మాట్లాడుకోవాలి: పరిటాల సునీత

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే శ్రీశైలం జల వివాదానికి పరిష్కారం లభిస్తుందని ఏపి పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అభిప్రాయపడ్డారు. మంత్రి సునీత కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు. జలాశయం అధికారులను నీటిమట్టాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అర్హులకు పింఛన్: గంటా

విశాఖపట్నం: అర్హులైన పేదలందరికీ పింఛన్ అందిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందజేశారు.

Sunita visits Srisailam project

జాబితాలో పేర్లు గల్లంతైన వారు మరోసారి దరఖాస్తు చేసుకుంటూ పింఛన్ మంజూరు చేస్తామని గంటా శ్రీనివాస రావు తెలిపారు. అనర్హులపై మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు.

రైతులకు మంచి ప్యాకేజి: సుజనాచౌదరి

కృష్ణా: రాజధాని కోసం సేకరించే భూముల యజమానులైన రైతులకు మెరుగైన ప్యాకేజీ అందజేస్తామని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజానా చౌదరి అన్నారు. తాము ఇచ్చే ప్యాకేజీతో రైతులు సంతోషంగా భూములు ఇచ్చే విధంగా చేస్తామని తెలిపారు.

పోరంకిలో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమంలో ఎంపి సుజనాచౌదరి పాల్గొన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకోమని స్పష్టం చేశారు. రైతు సాధికార సంస్థకు మరో 2వేల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు తెలిపారు.

English summary
Andhra Pradesh minister Paritala Sunita on saturday visited Srisailam project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X