వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో సూపర్ బాస్: అన్నీ ఆయన కనుసన్నల్లోనే.. నిఘా, నివేదికలు, బదిలీలు కూడా...

|
Google Oneindia TeluguNews

ఇంటెలిజెన్స్.. ఏ ప్రభుత్వానికి అయినా కళ్లు, చెవులు.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో గమనించి ఐబీ చీఫ్ ముఖ్యమంత్రికి నివేదిస్తారు. ప్రతీ రాష్ట్రంలో జరిగే ప్రక్రియే ఇదీ. అయితే ఏపీలో మాత్రం కాస్త భిన్నంగా జరుగుతోంది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో సీఎం కార్యాలయంలో నియమించిన ఒకరు ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నారు. అన్నీ ఆయన కనుసన్నల్లో అన్నీ జరుగుతున్నాయి. అధికారుల పోస్టింగులు, రాజకీయాలకు సంబంధించి నిఘా, జిల్లాల నుంచి వచ్చే నివేదికలు ముందుగా అతనికే చేరుతున్నాయని తెలుస్తోంది. ఆయన తీరుపై కొందరు సీనియర్ అధికారులు పెదవి విరుస్తున్నట్టు సమాచారం.

ఏపీలో సీన్ రివర్స్..

ఏపీలో సీన్ రివర్స్..


రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి హోంమంత్రి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎంతో సమావేశమై పరిస్థితిని వివరిస్తుంటారు. కానీ ఏపీలో మాత్రం అన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించే ఉన్నత అధికారుల పోస్టింగ్‌లు, ఇంటెలిజెన్స్‌, ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ విభాగాలు సైతం అతనికే రిపోర్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్నతస్థాయి పోలీసు అధికారులు, కీలక విభాగాల బాస్‌లు, జిల్లా స్థాయి పోలీసు అధికారులు ఆయనకే విషయాలు వివరిస్తున్నట్టు సమాచారం.

బదిలీలు, పోస్టింగ్, కీలక నిర్ణయాల్లో అతడిదే పైచేయి..

బదిలీలు, పోస్టింగ్, కీలక నిర్ణయాల్లో అతడిదే పైచేయి..


పోలీసుశాఖలో బదిలీలు, పోస్టింగ్‌, ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనదే పై చేయి అని చెబుతున్నారు. వాస్తవానికి పోలీసుశాఖ వ్యవహారాలను చూసేందుకు హోంమంత్రి ఉంటారు. కానీ అతనే ఇప్పుడు సూపర్ బాస్ అయ్యారు. శాంతి భద్రతలు, ఏసీబీ, విజిలెన్స్‌, ఇంటెలిజెన్స్‌ విభాగాలలు సీఎం చేతుల్లో ఉంటాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు రోజు సీఎంకు బ్రీఫింగ్‌ ఇస్తారు. పోలీసుశాఖలో డీఎస్పీ, ఆపైస్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగులను డీజీపీ ఇచ్చే సూచనల ఆధారంగా చేపడతారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన అంగీకరిస్తే చాలు చిటికేలో బదిలీ అయిపోతుంది.

నియమించుకోవచ్చు.. కానీ

నియమించుకోవచ్చు.. కానీ


పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం ప్రైవేటు వ్యక్తులను ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో నియమించుకునే అధికారం ఉంటుంది. అ విధంగా నియమించిన వ్యక్తులకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, శాంతిభద్రతలను పర్యవేక్షించే విభాగాల పనితీరులో వీరిని జోక్యం చేసుకోవద్దు. కానీ ఇప్పుడు సీన్ రివర్స అయ్యింది. పోలీసు అధికారులు ఫస్ట్ అతనిని దర్శించుకోవాలని, రెగ్యులర్‌ నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.

Recommended Video

#WhereisKcr : KCR Missing..వైరస్ తగ్గేదాకా అక్కడే ! || Oneindia Telugu
ప్రైవేట్ వ్యక్తి చేతికి సరికాదు

ప్రైవేట్ వ్యక్తి చేతికి సరికాదు


నిఘా విభాగం అందజేసే నివేదికలు నేరుగా సీఎంకే వెళ్లాలని సీనియర్ అధికారి ఒకరు అంటున్నారు. సీఎం తీరిక లేకుండా ఉన్నా ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. కానీ దీనిని సీఎం కన్నా ముందు ఓ ప్రైవేటు అధికారితో రహస్యాలు పంచుకోవడం సరికాదు అంటున్నారు. నిఘా నివేదికలు పరిశీలించడానికి, బ్రీఫింగ్‌ తీసుకోవడానికి ఆ ప్రైవేటు అధికారికి చట్టబద్ధత ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

English summary
super boss: andhra pradesh cmo recruited executive cadre officer in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X