నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విప్ ధిక్కారణ: కావలి ఛైర్‌పర్సన్ అలేఖ్యకు నోటీసు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ అలేఖ్యకు భారత అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. గత ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అలేఖ్య ఛైర్మన్ పదవిని ఆశించారు.

అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చివరి క్షణాల్లో అలేఖ్యకు చైర్మన్‌ పదవిని ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మరికొద్ది సేపట్లో ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందనగా అలేఖ్య, మరో కౌన్సిలర్ వెంకటేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

Supreme court sent notice to Kavali Municipal chairperson Alekhya, Nellore district

దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. విప్ ధిక్కారణపై పూర్తి విచారణ జరిపి ఎన్నికల అధికారి వెంటనే నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కొన్ని రోజుల పాటు అలేఖ్య చైర్మన్‌గా కొనసాగాలంటూ స్టే ఇచ్చింది.

దీంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అనంతరం అలేఖ్యపై విచారణ జరిపి పూర్తి వివరాలు అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో అలేఖ్య చైర్మన్‌గా కొనసాగడం కోర్టును ధిక్కరించడమే అంటూ ధర్మాసనం ధిక్కార నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

English summary
Supreme court sent notice to Kavali Municipal chairperson Alekhya, Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X