విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి కట్టుకుంటే అఢ్డుకుంటారా: సుప్రీం తీవ్ర ఆగ్రహం, బాబుకు ఊరట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏబీకే ప్రసాద్‌కు చుక్కెదురయింది. రాజధానిని కట్టుకుంటుంటే అడ్డుకుంటారా అని సుప్రీం కోర్టు పిటిషన్ దారును ప్రశ్నించింది.

Amaravati

అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుుక్రవారం నాడు కొట్టివేసింది. రైతులకు రాజధానికి ఇవ్వడం ఇష్టం లేదని, వారికి ఇబ్బందులు అని అభిప్రాయపడగా.. వారు వచ్చినప్పుడు పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

రాజధాని నిర్మాణంలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఏబీకే ప్రసాద్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం జరిపిన విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. రాజధానిని కట్టుకోవాలనుకుంటే అడ్డుకుంటారా?, రాజధాని ఎక్కడ కట్టుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో అదనపు సమాచారం కోర్టుకు సమర్పిస్తామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థించగా, ఆ అభ్యర్థనను సైతం సుప్రీం తిరస్కరించింది.

English summary
Supreme Court shocks ABK Prasad on capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X