వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్రభుత్వానికి రిలీఫ్: పోలవరంపై అభ్యంతరం లేదు..కానీ: సుప్రీంలో తెలంగాణ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం కొంత రిలీఫ్ ఇచ్చింది. అదే సమయంలో కొన్ని కండీషన్లు పెట్టింది. పోలవరం నిర్మాణం పైన తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని సుప్రీం కోర్టులో స్పష్టం చేసింది. అయితే, రెండు అంశాలను మాత్రం పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఒడిశా లేవెనెత్తిన అభ్యంతరాల మీద రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిన సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు పోలవరం నిర్మాణం పైన అభ్యంతరాలు లేవని..ఇదే విషయం కోర్టులో స్పష్టం చేస్తామని ప్రకటించారు. అదే విధంగా ఒడిశాకు అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు తాను కూడా చొరవ తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

పోలవరం పైన అభ్యంతరం లేదు..
పోలవరం పైన అభ్యంతరం లేదని తెలంగాణ సుప్రీం కోర్టులో స్పష్టం చేసింది. అయితే మణుగూరు ప్లాంటు, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. జగన్ సీఎం అయిన తరువాత కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని..పోలవరం పైన కేసీఆర్ సుప్రీం కోర్టులో కేసు వేసారని..ఆయనతో ఎలా కలిసి నడుస్తారని టీడీపీ ప్రశ్నించింది. ఆ సమయంలోనే కేసీఆర్ తాము పోలవరానికి వ్యతిరేకం కాదని..కోర్టులోనూ ఈ విషయం స్పష్టం చేస్తామని చెప్పారు. ఇప్పుడు కోర్టులోనే అదే విషయాన్ని స్పష్టం చేసారు. కానీ, తాము ప్రస్తావించిన రెండు అంశాలను మాత్రం ఏపీ ప్రభుత్వం పరిగ ణలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కోరింది.

Supreme court suggested to submit polavaram status report with in two weeks

పూర్తి సమాచారం ఇవ్వాలంటూ..
పోలవరం ప్రాజెక్టుపై ఒడిషా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్టేటస్ రిపోర్టు, నిర్మాణ చిత్రాలతో పూర్తి సమాచారాన్ని అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారని ఒడిషా వాదనలు వినిపించింది. ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని ఒడిషా తరఫు న్యాయవాది.. వాదనలు వినిపించారు. ప్రాజెక్టు యధావిధిగానే కొనసాగుతుందని ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒడిస్సా, తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని ఏపీ సర్కార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. దీంతో..రెండు వారాలకు కేసు వాయిదా పడింది.

English summary
Telangana Govt clarified in supreme court that they dont have objection on Polavarm project. But, they worried about about two issues. Supreme court suggested AP govt to file full information on project with in two weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X