వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌దే: జగన్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు, భూమాకు ఊరట

|
Google Oneindia TeluguNews

విజయవాడ: సుప్రీం కోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం నాడు చుక్కెదురయింది. భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి సహా ఇరవై మంది ఎమ్మెల్యేలు 2014లో వైసిపి నుంచి గెలిచి, ఇటీవల అధికార టిడిపిలో చేరారు.

దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టు గడప తొక్కింది. తమ పార్టీ టిక్కెట్ పైన గెలిచి, సైకిల్ ఎక్కిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వారు తమ పిటిషన్‌లో విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు తోసిపుచ్చింది.

'వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరింది వాస్తవం కాదా': బయటపెట్టిన వైసిపి'వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరింది వాస్తవం కాదా': బయటపెట్టిన వైసిపి

Supreme Court suspends YSRCP petition

ఈ కేసులోని విషయాలు స్పీకర్ పరిధిలో ఉంటాయని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. అవసరమైత్ ఈ విషయమై తొలుత హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కేసు విచారణను హైకోర్టు త్వరలోనే పూర్తి చేస్తుందనితాము నమ్ముతున్నందున, హైకోర్టుకు కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోవడం లేదన్నారు. సుప్రీం తీర్పు టిడిపిలో చేరిన వారికి తాత్కాలిక ఊరట అని చెప్పవచ్చు.

జగన్‌కు స్పీకర్ కోడెల షాక్: ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఊరటజగన్‌కు స్పీకర్ కోడెల షాక్: ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఊరట

కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పైన వైసిపి నేతలు ఇటీవల ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు ఫిర్యాదు చేశారు. వైసిపి ఇచ్చిన నోటీసు నిబంధనల ప్రకారం లేదని సభాపతి దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుప్రీం కోర్టులోను చుక్కెదురైంది.

English summary
Supreme Court suspends YSR Congress Party petition on MLAs defections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X