వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఏపీ పరువు గంగలో కలిపిన చంద్రబాబు', 'మేం డబ్బా కొట్టుకోం'

ప్రత్యేక హోదా భరోసా సభకు విభిన్న పార్టీల నాయకులు హాజరయ్యారని, దీనికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడంతో ఏపీ పరువును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంగలో కలిపారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ప్రత్యేక హోదా భరోసా సభకు విభిన్న పార్టీల నాయకులు హాజరయ్యారని, దీనికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడంతో ఏపీ పరువును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంగలో కలిపారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.

<strong>అఖిలప్రియకు వైసిపి ఝలక్: నంద్యాల అభ్యర్థిని ప్రకటించిన బంధువు</strong>అఖిలప్రియకు వైసిపి ఝలక్: నంద్యాల అభ్యర్థిని ప్రకటించిన బంధువు

ఎవరు పోరాడినా మద్దతు

ఎవరు పోరాడినా మద్దతు

కాంగ్రెస్‌కు సిపిఐకు విభేదాలున్నా ప్రత్యేక హోదాపై పోరాడితే మద్దతిస్తామన్నారు. జాతీయ కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ... జంతు వధపై ముఖ్యమంత్రులంతా స్పందించాలన్నారు.

చిన్నప్పట్నుంచి వింటున్నా..

చిన్నప్పట్నుంచి వింటున్నా..

చిన్నప్పటి నుంచి పోలవరం మాట వింటున్నానని, ఎప్పటికవుతుందో తెలియలేదని, ప్రస్తుతం పూర్తవుతుందనే నమ్మకం కలిగిందని కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వేరుగా అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం వల్లే సాధ్యమవుతోందని తెలిపారు. పోలవరం కల తమవల్లే నెరవేరుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అనడం విడ్డూరమని విమర్శించారు.

జైల్లో ఉండాల్సిన వాళ్లు.. నీతులా

జైల్లో ఉండాల్సిన వాళ్లు.. నీతులా

ఎన్డీఏ ప్రభుత్వ జయాపజయాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. జైలులో ఉండాల్సిన వాళ్లు బెయిల్‌పై వచ్చి నీతులు బోధిస్తున్నారని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మేం డబ్బా కొట్టుకోం

మేం డబ్బా కొట్టుకోం

2019లో అధికారంలోకి వస్తామని డబ్బా కొట్టుకునే వ్యక్తిత్వం తమది కాదని అశోక్ అన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చారని, దాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తామే తప్పితే జ్యోతిష్యం చెప్పలేమన్నారు. జిల్లాకు ఒకటే విమానాశ్రయం ఉండాలనే నిబంధన లేదని, కొన్ని చోట్ల జిల్లాకు రెండు కూడా ఉండే అవకాశం ఉందని తెలిపారు. జనసేనతో పొత్తు గురించి వారినే అడగాలన్నారు.

English summary
Suravaram Sudhakar Reddy blames Chandrababu for protest at Special Status meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X