వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిఎస్ఆర్టీసీ నూతన ఎండీగా...ఐపీఎస్‌ అధికారి సురేంద్ర బాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎపిఎస్ ఆర్టీసీ నూతన ఎండీగా సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఎన్ వి సురేంద్ర బాబు నియమితులయ్యారు. ఎపిఎస్ఆర్టీసీ ఎండీ, వైస్ ఛైర్మన్ గా సురేంద్రబాబు ను నియమిస్తూ ఎపి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే ఇప్పటివరకు అదనపు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్నసురేంద్ర బాబుకు డైరెక్టర్ జనరల్ ర్యాంక్ పదోన్నతి కల్పించారు. మరోవైపు ఎపి విజిలెన్స్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్న ఎ.ఆర్.అనురాధ కూడా సురేంద్రబాబుతో పాటే డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కు ప్రమోట్ చేయబడ్డారు. ఎపిఎస్ ఆర్టీసీ ఎండీ పదవి నుంచి ఎపి డిజిపిగా నియమించబడిన మాలకొండయ్యే ఇప్పటివరకు ఆర్టీసీఎండిగా ఇన్ ఛార్జ్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సురేంద్రబాబు ఐపిఎస్...ఇప్పటివరకు...

సురేంద్రబాబు ఐపిఎస్...ఇప్పటివరకు...

ఎపిఎస్ ఆర్టీసీ నూతన ఎండీగా నియమితులైన ఐపీఎస్‌ అధికారి సురేంద్ర బాబు విషయానికొస్తే ఈయన 2001 నుంచి 2004ల మధ్య విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేశారు. ఆ తరువాత 2007లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా పదోన్నతి పొందారు. 2006 నుంచి 2007ల మధ్య హైదరాబాద్‌ సిటీ అడిషనల్‌ పోలీసు కమిషనరేట్‌లో కో-ఆర్డినేషన్‌ విభాగంలో పని చేశారు. అలాగే హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా కూడా ఆయన విధులు నిర్వర్తించారు.

పోలీస్ సర్కిల్లో...ముక్కుసూటి అధికారిగా

పోలీస్ సర్కిల్లో...ముక్కుసూటి అధికారిగా

ప్రస్తుతం ఆక్టోపస్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్నసురేంద్రబాబును తాజాగా ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండిగా నియమిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన సురేంద్రబాబుకు కఠినమైన మరియు ముక్కు సూటి అధికారిగా పోలీసు సర్కిల్స్ లో పేరుంది. ఆ తరువాత కాలంలో సురేంద్ర బాబు ఎపి డిజిపిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఆ తరువాత...డిజిపినా

ఆ తరువాత...డిజిపినా

కారణం ప్రస్తుతం ఎపి డిజిపిగా వ్యవహరిస్తున్నమాలకొండయ్యకు మరో 3 నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది. సాధారణంగా ఆర్టీసీ ఎండీగా పనిచేసే పోలీసు అధికారులే డిజిపి అయ్యే సాంప్రదాయం ఎపిలో ఉన్నందున అదే సాంప్రదాయం కొనసాగవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు కూడా అందుకు తగినట్లుగానే ఉండటం గమనార్హం.

విజిలెన్స్ డిజి అనురాధకు...ప్రమోషన్

విజిలెన్స్ డిజి అనురాధకు...ప్రమోషన్

మరోవైపు ఎపి విజిలెన్స్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్న ఎ.ఆర్.అనురాధ కూడా సురేంద్రబాబుతో పాటే డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కు ప్రమోట్ చేయబడ్డారు. ఆమె ప్రస్తుతం విజిలెన్స్ మరియుఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గానే కాకుండా హోమ్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగాగా కూడా పనిచేస్తుండటం గమనార్హం. అయితే ప్రమోషన్ తరువాత కూడా ఆమె అదే స్థానంలో కొనసాగుతారని తెలుస్తోంది.

English summary
Amaravathi: Senior IPS officer N V Surendra Babu will be the new vice-chairman and managing director (VC&MD) of Andhra Pradesh State Road Transport Corporation (APSRTC). He was also promoted to director general rank from additional director general. Apart from Surednra Babu, A R Anuradha was also promoted to director general rank. She is currently working as director general of vigilance and enforcement and also as principal secretary of home department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X