గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో ఆపరేషన్...గుజరాత్ లో ప్రత్యక్షప్రసారమా?...ఎందుకలా!

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. కారణం...శుక్రవారం నాడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహించిన క్లిష్టమైన మోకీలు శస్త్రచికిత్సలను గుజరాత్‌లోని అంతర్జాతీయ ఆర్ధోపెడిక్‌ వైద్య సదస్సులో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

పీపీపీ పద్ధతిలో సాయిభాస్కర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (గుంటూరు), ఉన్నతి ఫౌండేషన్‌ సహకారంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో నేడు నిర్వహించిన ఈ మోకీలు మార్పిడి శస్త్రచికిత్స గుజరాత్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ కోర్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు ఈ ఆపరేషన్ నిర్వహించిన ప్రముఖ సర్జన్‌ డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. శాటిలైట్‌ లింక్‌ ద్వారా ఈ సర్జరీ లైవ్ టెలికాస్ట్ చేసినట్లు వివరించారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

Surgery at Guntur Government Hospital live streamed

ఇదే కోవలో మొహాలీ, పూణె, పాట్నా, అహ్మదాబాద్‌లోని ఐదు కేంద్రాల్లో చేసే సర్జరీలను సైతం...గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ కోర్స్‌ సదస్సులో ప్రసారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో వైద్య నిపుణులు డాక్టర్‌ వరప్రసాద్‌ మాట్లాడుతూ మోకీలు మార్పిడి లైవ్ టెలికాస్ట్ తో...మరోసారి గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఖ్యాతి అంతర్జాతీయ స్ధాయిలో ఇనుమడించిందని అన్నారు.

English summary
Guntur: It's a rare achievement, a knee surgery performed at Government General Hospital (GGH), Guntur telecasted live at the prestigious international seminar on orthopaedics held in Vapi, Gujarat on today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X