కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విచిత్రం:ట్రేలో పుట్టిన కోడిపిల్ల...పొదగకుండానే పుట్టింది

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అంతకంతకూ పెరిగిపోతున్న అధిక ఉష్ణోగ్రత చిత్రవిచిత్రాలకు కారణమవుతోంది. కర్నూలు జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ఇలా బాగా పెరిగిన ఎండ తీవ్రత కారణం గానే జరిగిందంటున్నారు. ఇంతకూ కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఆ విచిత్ర ఘటన ఏంటంటే...

వంట కోసమని గుడ్లు కొనుక్కొచ్చి ఇంట్లోని ట్రేలో ఉంచితే దాని నుంచి కోడి పిల్ల చప్పుడు చేసుకుంటూ బైటకు రావడం...దీంతో అవాక్కవడం ఆ ఇంటి వారి వంతయింది. పైగా ఈ కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉండటం మరో విశేషం..వివరాల్లోకి వెళితే...

surprise as egg tray produces a chick in Andhra pradesh

కర్నూలు జిల్లా వెల్దుర్తి పరిధిలోని ఐజీ నగర్‌లో నివాసముంటున్నరిటైర్డ్ కానిస్టేబుల్ ఎల్లప్ప వంట అవసరాల నిమిత్తమని రెండు రోజుల కిందట కోడిగుడ్లను కొనుగోలు చేశారు. ఆ తరువాత వాటిని ఇంట్లో ఉన్న ఒక ట్రేలో ఉంచారు. అయితే ఆదివారం ఉన్నట్టుండి ఆ ట్రే నుంచి ఒక కోడిపిల్ల శబ్దం చేసుకుంటు బయటకు వచ్చింది. దీంతో ఇంట్లో వాళ్లు మొదట కంగారు పడినా ఆ తరువాత విషయం అర్థమై ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.

నాటుకోడి గుడ్లను తల్లి కోడి సహజమైన వాతావరణంలో పొదిగినా లేక ఆ గుడ్లను అనువైన ఉష్ణోగ్రత, పరిశుద్ధ వాతావరణం ఉన్న చోట పొదిగించడం ద్వారా 21 రోజుల తర్వాత కోడి పిల్ల వస్తుందని పశు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ఈ నాటు కోడి గుడ్డులోని పిల్లకు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు పొదుగుడు లాంటి వాతావరణం ఏర్పరచడం వల్ల ఇలా గుడ్డు నుంచి పిల్ల బయటపడతాయని అన్నారు. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగానే జరుగుతాయని తెలిపారు.

English summary
If the eggs were brought for cooking and put them in the tray, then one baby chick comes out of it created sensation in Andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X