విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రోకి సర్వే, బాబుకి ఖతార్ పిలుపు, భారీ పెట్టుబడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Survey for Vijayawada metro
హైదరాబాద్: విజయవాడలో మెట్రో రైలు కారిడార్ల సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు అవసరమైన పనులను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) చేపడుతోంది. ఈ మేరకు ట్రాఫిక్‌ సర్వే బాధ్యతలను ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించారు. శనివారం నుంచి టోపో గ్రాఫికల్‌ సర్వే ప్రారంభించింది.

మెట్రో కారిడార్‌లో ప్రధానమైన బందరు రోడ్డులో ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కారిడార్‌లో ప్రతి కిలో మీటర్‌కు స్టేషన్‌ను నిర్మించాల్సి ఉంది. ఎక్కడెక్కడ స్టేషన్ల ఏర్పాటు చేయవలసి ఉంటుంది, అక్కడ ఎలాంటి భవనాలున్నాయి.. వంటి వివరాలను కూడా సర్వేలో పొందుపరుస్తున్నారు.

దాదాపు పది రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. మరోవైపు, ట్రాఫిక్‌ సర్వేను మరో కన్సల్టెన్సీ చేపడుతోంది. ఏ బస్ స్టేషన్ల నుండి, రైల్వే స్టేషన్ల నుండి ఎంత ట్రాఫిక్, ఏ సమయాల్లో ఎలా ట్రాఫిక్ ఉంటుందనే విషయమై సర్వే చేస్తోంది.

ఏపీలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు

ఏపీలో వివిధ రంగాల్లో అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ ముందుకు వచ్చింది. ఈ మేరకు శనివారం ఖతార్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ హమిద్ బిన్ నాసర్ అల్ ధాని నేతృత్వంలో ప్రతినిధి బృందం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు అడిగి తెలుసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నందున వచ్చామని చంద్రబాబుతో చెప్పారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఖతార్ రావాలంటూ ఆహ్వానించారు.

English summary
Survey for Vijayawada metro Rail Project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X