వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు భేష్: కాంగ్రెస్ ముఖ్యనేత షిండే ప్రశంసలు, 'వవన్‌వి నిలకడ లేని రాజకీయాలు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రశంసలు కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న చంద్రబాబును అభినందిస్తున్నానని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నాడు పార్లమెంటు అంగీకరించిందని తెలిపారు. ఏపీకి తప్పనిసరిగా ప్రత్యేక హోదా రావాలని చెప్పారు. 2019లో తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పారు.

సభ్యసమాజం ఆమోదించదు: బాలకృష్ణపై పురంధేశ్వరి ఆగ్రహం, కర్నాటకలో ప్రచారంసభ్యసమాజం ఆమోదించదు: బాలకృష్ణపై పురంధేశ్వరి ఆగ్రహం, కర్నాటకలో ప్రచారం

ఇప్పుడు బీజేపీ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు

ఇప్పుడు బీజేపీ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు

సుశీల్ కుమార్ షిండే గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనార్థం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీకి అవసరమైన వసతులు కల్పించాలని చట్టంలో పేర్కొన్నామని, కానీ ఇప్పుడు బీజేపీ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు, నేతలు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని చెప్పారు.

మోడీపై అందరి వ్యతిరేకత

మోడీపై అందరి వ్యతిరేకత

కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సుశీల్ కుమార్ షిండే ధీమా వ్యక్తం చేశారు. కథువా, ఉన్నావ్ ఘటనలు బాధాకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన హామీలు ఏవీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అన్ని వర్గాలలోను ప్రధాని మోడీపై వ్యతిరేకత ఉందని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌వి నిలకడలేని రాజకీయాలు

పవన్ కళ్యాణ్‌వి నిలకడలేని రాజకీయాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీని కాకుండా వైసీపీ అధినేత జగన్, పవన్ కళ్యాణ్‌లు తమను విమర్శించడం సరికాదన్నారు. ఆగస్టులో డీఎస్సీ ఉంటుందని తెలిపారు.

ప్రత్యేక హోదా ఉద్యమం

ప్రత్యేక హోదా ఉద్యమం

కాగా, ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు పోరాడుతోన్న విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దాని బదులు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెబుతోంది. హోదా విషయంలో చంద్రబాబు ఎన్నో రకాల మాటలు మార్చారని బీజేపీ,వైసీపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మండిపడుతున్నాయి.

English summary
Former Union Minister Sushil Kumar Shinde praises CM Chandrababu Naidu for protest for Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X