• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు.. తనకే సంబంధం లేదన్న ఏబీవీ.. అటు నుంచి నరుక్కొచ్చేలా ఎత్తుగడ

|

కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏబీవీ గురువారం కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఇప్పటికే క్యాబ్ పలుమార్లు ఏపీ సర్కారుకు తీవ్ర హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో అటు నుంచి నరుక్కురావడమే బెస్టని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. క్యాట్ లో దాఖలు చేసిన పిటిషన్ లో ఈ మేరకు ఏబీవీ తీవ్ర ఆరోపణలు చేశారు.

జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు..!జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు..!

  Evening News Express : 3 Minutes 10 Headlines | Karnataka Bandh | Jagan Modi 2nd Meet
  10 నెలలుగా జీతంలేదు..

  10 నెలలుగా జీతంలేదు..

  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ కక్షతో కొందరు అధికారుల్ని టార్గెట్ చేశారని, ఎలాంటి ఆధారాలు లేకున్నా తనపై దేశద్రోహం లాంటి తీవ్రమైన ఆరోపణలతో సస్పెండ్ చేశారని క్యాట్ కు సమర్పించిన పిటిషన్ లో ఏబీవీ పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్ని వెంటనే కొట్టేయాలని అభ్యర్థించారు. గత 10 నెలులుగా జీతం కూడా చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  తీర్పుపై టెన్షన్..

  తీర్పుపై టెన్షన్..

  చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారుల్ని వైసీపీ ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలతో వెల్లడవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసి, జీతం కూడా నిలిపేయడంపై క్యాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికప్పుడు కిషోర్ కు సర్కారు జీతం చెల్లించింది. ఇప్పుడు ఐపీఎస్ అధికారి ఏబీవీ కూడా సర్కారు జీతం చెల్లించలేదని ఆరోపించారు. ఏబీవీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన క్యాబ్.. తీర్పు ఏం చెబుతుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  ఏబీవీపై తీవ్ర ఆరోపణలు

  ఏబీవీపై తీవ్ర ఆరోపణలు


  ఐపీఎస్ అధికారి ఏబీవీ సస్పెన్షన్ కు సంబంధించి వైసీపీ సర్కారు మొత్తం ఏడు కారణాల్ని పేర్కొంది. వాటిలో ప్రధానమైంది.. సెక్యూరిటీ పరికరాల కొనుగోళ్లు. అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా పని చేసిన సమయంలో ఏబీవీ నిబంధనలకు విరుద్దంగా ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు చేశారని, వాటికి తప్పుడు పనులకు వాడారని, అది దేశరక్షణ చట్టాలకు విరుద్ధమని ప్రభుత్వం ఆరోపించింది.

  ఎమ్మెల్యేల కొనుగోళ్లలో హస్తం..

  ఎమ్మెల్యేల కొనుగోళ్లలో హస్తం..


  చంద్రబాబు హయాంలో ఐపీఎస్ అధికారి ఏబీవీ పెద్ద మాఫియాను నడిపారని, వైసీపీని దెబ్బతీయడానికి ప్రభుత్వ నిఘా వ్యవస్థను వాడుకున్నారని, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులోనూ ఏబీవీనే దళారీగా పనిచేశారని సీఎం జగన్ కు అత్యంత ఆప్తుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అయితే తనపై వచ్చినవన్నీ రాజకీయ ప్రేరిత ఆరోపణలేనని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సమయంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని క్యాట్ కు సమర్పించిన పిటిషన్ లో ఏబీవీ పేర్కొన్నారు.

  చంద్రబాబు సమర్థన..

  చంద్రబాబు సమర్థన..

  ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరా రావు సస్పెన్షన్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు ఖండించారు. అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనపెడుతోన్న ప్రభుత్వం... మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉంటే జీతాలు చెల్లించబోమని మెలిక పెట్టడం దారుణమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వందలమంది అధికారులకు 8నెలలుగా పోస్టింగ్ లు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. కొద్ది రోజుల కిందటే కృష్ణ కిషోర్ విషయంలో క్యాట్ చేత చివాట్లు తిన్న వైసీపీ ప్రభుత్వం.. ఏబీవీ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

  English summary
  suspended ips officer, former intelligence chief ab venkateswara rao files petition in central administrative tribunal on thursday. abv accused tha ysrcp government politically pressuring him
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X