వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందంగా ముస్తాబై టిక్‌టాక్.. కాసేపటికే ఫ్యాన్‌కు వేలాడుతూ.. అసలేం జరిగినట్టు..?

|
Google Oneindia TeluguNews

రెగ్యులర్‌గా టిక్‌టాక్‌లో వీడియోలు చేసే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటిదాకా తమతోనే ఉన్న తల్లి హఠాత్తుగా ఫ్యాన్‌కు వేలాడటం చూసి పిల్లలు షాక్ తిన్నారు. టిక్ టాక్ వీడియో చేసే క్రమంలో అనుకోకుండా ఆమె మెడకు ఉరి బిగుసుకుందా.. లేక మరేదైనా కోణం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. విశాఖ జిల్లా పెందుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎవరా మహిళ..

ఎవరా మహిళ..

విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ(28)కు భర్త,ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఆర్మీలో పనిచేస్తుండటంతో పిల్లలను చదివించుకుంటూ ఆమె విజయనగరంలోనే నివసిస్తుండేది. కొన్నాళ్ల క్రితమే విజయనగరం నుంచి విశాఖ జిల్లా పెందుర్తిలోని ఓ అద్దె ఇంట్లో దిగింది. భర్త ప్రతీ నెలా ఖర్చులకు డబ్బులు పంపిస్తుండేవాడు. దీంతో ఆమె సాధారణ గృహిణిలా ఇంట్లోనే ఉండేది.

టిక్‌టాక్ అంటే పిచ్చి..

టిక్‌టాక్ అంటే పిచ్చి..

ఇంట్లో ఖాళీగా ఉంటే ఉబుసుపోక.. టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ప్రతీరోజూ అందంగా తయారయై,మేకప్ వేసుకుని టిక్‌టాక్ వీడియోలు చేసేది. ఇలా రోజుకు కనీసం ఒక్క వీడియో అయిన టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసేది. ఇదే క్రమంలో సోమవారం కూడా అందంగా తయారై ఓ టిక్‌టాక్ వీడియో చేసింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె ఉరివేసుకుని చనిపోవడం కలకలం రేపింది.

Recommended Video

Gas Leak in Telangana's Sirpur Kagaznagar Paper Mill After Vizag Lg Polymers
టిక్‌టాకే ప్రాణం తీసిందా..?

టిక్‌టాకే ప్రాణం తీసిందా..?

రోజూ లాగే టిక్‌టాక్ వీడియోలు చేస్తుందోమోనని ఆమె ఇద్దరు కుమార్తెలు భావించారు. కానీ కొంతసేపటికి ఆమె గదిలోకి వెళ్లి చూసేసరికి షాక్ తిన్నారు. తల్లి ఉరేసుకుని కనిపించడంతో గట్టిగా కేకలు పెట్టారు. దీంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను కిందికి దించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె మృతి చెందిన గదిలో సన్‌ సైడ్‌పై సెల్‌ఫోన్ ఉండటాన్ని గుర్తించారు. దీంతో టిక్‌టాక్ వీడియో చేసే క్రమంలోనే ఆమె ప్రాణాలు పోగొట్టుకుందా లేక మరేదైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

English summary
A 28 years old woman died on Monday under suspicious circumstances in Pendurthi,Vizag. Allegedly she was addicted to TIKTOK and monday also made some videos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X