వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్, మోదీ ఫోటోలతో సుజనా ఫ్లెక్సీలు..! ప్రత్యక్ష రాజకీయాల కోసమే బీజేపీలో చేరానన్న సుజనా..!!

|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విజయవాడకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి ఆయన విజయవాడకు వచ్చారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి విజయవాడ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సుజనా చౌదరి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సుజనా రాక సందర్భంగా విజయవాడలో రహదారి పొడవున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రధాని మోదీ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై ఒక్కొక్కరు ఒక్కోలా చర్చించుకుంటున్నారు. ర్యాలీ అనంతరం బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించే ఆత్మీయ సమావేశంలో సుజనా పాల్గొనన్నారు. ఈ సందర్బంగా సుజనా చౌదరి సమకాలీన రాజకీయల గుదరించి,అందులో తన పాత్ర గురించి ఆసక్తి వ్యాఖ్యలు చేసారు. మరోవైపు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Suzana Flexies With NTR And Modi Photos ..! Sujana joins BJP for live politics .. !!

తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఈరోజు ఏపీకి వచ్చారు. గుంటూరులోని అమరావతిలో ఈరోజు బీజేపీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సుజనా మాట్లాడారు. బీజేపీలో చేరకముందు తాను పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నానని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరారని చెప్పారు.

ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సారథ్యంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యత పెరిగిందన్నారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదర్చడంలో తాను కీలక పాత్ర పోషించానని సుజనా చౌదరి తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ధర్మపోరాటాల పేరుతో అధర్మ పోరాటాలు చేశారని విమర్శించారు. ఈ విషయంలో తాను గొంతు విప్పి చాలా స్పష్టంగా చెప్పానని అన్నారు.

English summary
Sujana was speaking at the inaugural session of the BJP rallies in Amravati in Guntur today. Before joining the BJP, he said he was into indirect politics. He said he had joined the BJP with the intention of getting into direct politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X