వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఎస్వీ మోహన్ రెడ్డి అంత మాటన్నారా, అఖిలప్రియ కంగు

టిడిపి నేత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నంద్యాలలో ఆయన ఇటీవల టిడిపి నేతలు, కార్యకర్తలు హాజరైన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: టిడిపి నేత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నంద్యాలలో ఆయన ఇటీవల టిడిపి నేతలు, కార్యకర్తలు హాజరైన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవి చర్చకు దారి తీశాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలకు పదవుల పంట పండిందని, ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

అయితే, ఆయన అంతకుమించి మరింత ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారని మీడియాలో ప్రచారం సాగుతోంది. నంద్యాల అభివృద్ధిని చూసి పక్క నియోజకవర్గాల ప్రజలు తమ ఎమ్మెల్యే కూడా పోతే బాగుండునని అనుకుంటున్నారని మాట్లాడినట్లుగా చెబుతున్నారు.

ఎస్వీ వ్యాఖ్య.. అఖిలప్రియ కంగు

ఎస్వీ వ్యాఖ్య.. అఖిలప్రియ కంగు

ఎస్వీ మోహన్ రెడ్డి అలా మాట్లాడినప్పుడు పక్కనే మంత్రులు అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డిలు ఉన్నారని కూడా చెబుతున్నారు. ఎస్వీ చేసిన వ్యాఖ్యలతో వారిద్దరు ఖంగు తిన్నారని కూడా చెబుతున్నారు.

Recommended Video

TDP Senior Leader Shilpa Mohan Reddy Announced Date to Join YSRCP
ఆ విషయం పక్కన పెడితే..

ఆ విషయం పక్కన పెడితే..

ఎమ్మెల్యేలపై ఆయన మాట్లాడిన విషయాన్ని పక్కన పెడితే, అభివృద్ధిపై చెప్పింది మాత్రం నిజమని విపక్ష నాయకులు అంటున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో టిడిపి నంద్యాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, నిధులు మంజూరు చేస్తోందని చెబుతున్నారు.

గెలుపు కోసం బాబు ఇలా అంటూ..

గెలుపు కోసం బాబు ఇలా అంటూ..

అంతేకాదు, నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో నేతలకు పదవులు కూడా కట్టబెట్టిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే నౌమన్‌కు పదవి కట్టబెట్టారని, మైనార్టీ ఓట్లు పడేల.. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే ఫరూక్‌కు మండలి చైర్మన్ పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.

నంద్యాలలో అభివృద్ధి పనులు ఇలా..

నంద్యాలలో అభివృద్ధి పనులు ఇలా..

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాపు కళ్యాణ మండపం, రోడ్లు వేయిస్తామని చెప్పి పది రోజుల్లోనే రూ.300 కోట్ల మేర అభివృద్ధి పథకాలను సర్కార్ ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు.

English summary
It is said that, Kurnool MLA and Telugu Desam Party leader SV Mohan Reddy make shocking comments in Nandyal party meeting. Ministers Akhila Priya and Adinarayana Reddy were shocked with his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X