వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెల్లూరులో స్వర్ణభారతి 18వ వార్షికోత్సవం. చీఫ్ గెస్ట్ గా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

|
Google Oneindia TeluguNews

నెల్లూరు : వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న స్వర్ణభారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన ట్రస్ట్ దశదిశాల వ్యాపించింది. ఏపీతోపాటు తెలంగాణ .. ఇతర ప్రదేశాల్లో కూడా ట్రస్ట్ బ్రాంచ్ లను ఏర్పాటు చేసుకుంది.

swarna bharathi 18th anniersary celebrations .. to be attend chief guest president ramnath

ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్ నాథ్ ..
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో గురువారం జరిగే 18వ వార్షికోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతారు.

swarna bharathi 18th anniersary celebrations .. to be attend chief guest president ramnath

ఇదీ రాష్ట్రపతి షెడ్యూల్ ..
గురువారం ఉదయం 11.15 గంటలకు వెంకటాచలంలోని స్వర్ణభారతి ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ వద్దకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్, సీఎం చేరుకుంటారు. వారిని అక్కడ ట్రస్ట్ నిర్వాహకులు ఘన స్వాగతం పలుకడంతో కార్యక్రమం ప్రారంభమవుతోంది. 11.17 గంటలకు రాష్ట్రపతికి గౌరవ సూచకంగా జాతీయ గీతాలాపన చేస్తారు. 11.20 గంటలకు దీపా వెంకట్ స్వర్ణ భారతీ ట్రస్ట్, అందిస్తున్న సేవల గురించి ప్రారంభోపన్యాసం చేస్తారు. 11.25 గంటల నుంచి 25 నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారుు. 11.40 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు .. ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రసంగిస్తారు. 11.45 గంటలకు ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు ప్రసంగ కార్యక్రమం ఉంటుంది. 11.55 గంటలకు రాష్ట్రపతి మాట్లాడతారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ట్రస్ట్ నిర్వాహకులతో గ్రూప్ ఫొటో కార్యక్రమం ఉంటుంది. 12.10 గంటలకు స్వర్ణభారతి ట్రస్ట్ చైర్మన్ కేవీ విష్ణురాజు ముగింపు ఉపన్యాసం చేస్తారు. 12.14 గంటలకు జాతీయ గీతాలాపనతో స్వర్ణోత్సవ కార్యక్రమం ముగుస్తోంది. 12.15 గంటలకు ట్రస్ట్ ప్రాంగణం నుంచి రాష్ట్రపతి ఢిల్లీ బయల్దేరి వెళతారు.

English summary
president of india Kovind will be the chief guest of the swarna bharathi 18th anniversary celebrations in Venkatachalam in Nellore district. Arrangements have already been prepared for the event. Vice President Venkiah Naidu, Governor Narasimhan, AP CM Chandrababu Naidu will attend the Anniversary ceremony along with President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X