వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టుకాగా, ఇంకొందరికి నోటీసులు జారీ అవుతున్నాయి. మూడు రోజుల కిందట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివారావు కోడలు డాక్టర్‌ మమతను విచారణకు పిలిచిన పోలీసులు.. తాజాగా రమేశ్ ఆస్పత్రి యజమాని రామ్మోహన్ రావు కోడలు రాయపాటి శైలజకూ నోటీసులు జారీ చేశారు. మరోవైపు స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కుట్ర ఆరోపణలు, కులాల ప్రస్తావన చేసిన హీరో రామ్ పోతినేనికి టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి మద్దతుగా నిలిచారు.

చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?

ఇంటికి రావొద్దన్న శైలజ..

ఇంటికి రావొద్దన్న శైలజ..

స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కొవిడ్ సెంటర్ నిర్వహించిన రమేశ్ ఆస్పత్రిపై తీవ్ర ఆరోపణలు రావడం, చీఫ్ డాక్టర్ రమేశ్ బాబు అజ్ఞాతంలోకి జారుకుని, హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తుండటం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా రమేశ్ ఆస్పత్రి చైర్మన్‌ రామ్మోహన్‌రావు కోడలు రాయపాటి శైలజకు నోటీసులిచ్చిన పోలీసులు.. గుంటూరులోని ఇంట్లోనే విచారిస్తామని చెప్పగా అందుకామె నిరాకరించారు. తాను విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి వస్తానని, అక్కడే ప్రశ్నలకు సమాధంనం చెబుతానని శైలజ పేర్కొన్నారు.

హైకోర్టులోనూ విచారణ..

హైకోర్టులోనూ విచారణ..

పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ శైలజకు నోటీసులిచ్చారు. కోవిడ్ కారణంగా గుంటూరులోని శైలజ నివాసంలోనే విచారిస్తామని కూడా పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ నోటీసులపై స్పందించిన శైలజ.. విచారణ నిమిత్తం తాను గుంటూరులోని రమేశ్ హాస్పిటల్‍కు వస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి ప్రత్యేక పోలీస్ బృందం గుంటూరుకు బయల్దేరింది. శైలజ స్టేట్మెంట్ రికార్డు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. రాయపాటి శైలజా స్టేట్మెంట్ కోరడంపై సర్వత్రా చర్చంశనీయాంశమైంది.

రాయపాటి ఫ్యామిలీపై ఫోకస్?

రాయపాటి ఫ్యామిలీపై ఫోకస్?

అగ్ని ప్రమాదం కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు మమతకు నోటీసులిచ్చి విచారించిన పోలీసులు.. తాజాగా రాయపాటి తమ్ముడైన రామ్మోహన్ రావు కోడలు శైలజకూ నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. కరోనా సోకిందని చెప్పినా వదలకుండా మమతను విచారించడం వివాదాస్పదమైంది. మొత్తంగా ఈ కేసులో రాయపాటి ఫ్యామిలీపై ఫోకస్ గట్టిగానే ఉంచినట్లు పరిణామాలను బట్టి తెలుస్తోంది. రాయపాటి శైలజ అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు..

జేడీ లక్ష్మీనారాయణపై జగన్ ట్యాపింగ్ - మోదీకి రాస్తే డీజీపీ స్పందనా? - చంద్రబాబు సంచలనంజేడీ లక్ష్మీనారాయణపై జగన్ ట్యాపింగ్ - మోదీకి రాస్తే డీజీపీ స్పందనా? - చంద్రబాబు సంచలనం

హీరోకు వైసీపీ బెదిరింపులు..

హీరోకు వైసీపీ బెదిరింపులు..

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంగళవారం పార్టీ నేతలతో సమావేశం అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసిన రామ్ పోతినేని పట్ల విజయవాడ ఏసీపీ వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు.. మరోసారి హీరో పేరును ప్రస్తావించారు. కరోనా కంటే కుల వైరస్ ఏపీలో ఉధృతంగా ఉందన్న రామ్ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయని, రామ్ సినిమాలు రాష్ట్రంలో ఆడనివ్వబోమంటూ వైసీపీ బెదిరింపులకు దిగుతున్నదని, డాక్టర్ రమేశ్ బాబును ఫ్యామిలీని సైతం జగన్ సర్కారు వేధిస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు.

15 నెలలుగా ఉన్మాద విధ్వంసం..

15 నెలలుగా ఉన్మాద విధ్వంసం..

తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 15 నెలలుగా తప్పుల మీద తప్పులు చేస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, ఉన్మాదంతో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని చంద్రబాబు మండిపడ్డారు. గోదావరి ఉధృతికి ఆవ భూముల్లోనూ భుజాల లోతులో వరద నీరు చేరిందని, అలాంటి ముందపు ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామనడం దారుణమన్నారు. సాక్ష్యాధారాలతో సహా వైసీపీ అక్రమాలు బయటపడినా ఇప్పటిదాకా చర్యలు లేవని చంద్రబాబు వాపోయారు.

శైలజ షాకింగ్ కామెంట్స్..

శైలజ షాకింగ్ కామెంట్స్..

మంగళవారమే పోలీసుల ముందు హాజరైన రాయపాటి శైలజ విచారణ జరిగిన తీరుపై అనూహ్య కామెంట్లు చేశారు. ‘‘కొవిడ్ సెంటర్లకు ఎప్పుడైనా వెళ్లారా? అని అడిగితే, నేను గత ఏడెనిమిది నెలలుగా వైద్య వృత్తిలో లేనని చెప్పాను. నా పుట్టుపూర్వోత్తరాలపైనా వాళ్లు ఆరా తీశారు. స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం అనుకోకుండా జరిగింది. అన్ని అనుమతుల తర్వాతే అక్కడ కొవిడ్ సెంటర్ ఏర్పాటైంది. రాష్ట్రంలో చాలాచోట్ల అగ్నిప్రమాదాలు జరిగినా ఇంతలా వేధింపులు లేవు. మా ప్రతిష్టను భంగపర్చే కుట్ర జరుగుతోంది. న్యాయం మావైపు ఉంది కాబట్టి, త్వరలోనే ఇబ్బందుల్ని అధిగమిస్తాం'' అని శైలజ పేర్కొన్నారు.

English summary
Vijayawada police issued notices to rayapati sailaja, daughter in law of ramesh hospital owner ram mohan rao on tuesday. tdp chief chandrababu supports hero ram pothineni, who alleges conspiracy on fire incident. chandrababu alleges that ysrcp is threatening hero ram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X