విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షిర్డీ సాయి ఏం చేశాడు: భక్తులకు ప్రశ్నలు సంధించిన స్వరూపానంద

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: షిర్డీ సాయిబాబా దేవుడే కాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మరోసారి అన్నారు. షిర్డీ సాయి భక్తులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. హైదరాబాదులోని షిర్డీ సాయిబాబా దేవాలయం వద్ద భక్తులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

దాంతో స్వరూపానంద మరోసారి శుక్రవారం మరోసారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను సమర్థించుకున్నారు. ఏ తప్పులు చేసినా తమ వద్దకు వస్తే పాపాలన్నీ నశిస్తాయని చమత్కారులు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

చాంద్‌మియానే షిర్డీ సాయిబాబాగా పూజిస్తున్నారని ఆయన చెప్పారు. దేశం పరాయి పాలనలో మగ్గుతున్న్పప్పుడు సాయిబాబా జన్మించాడని చెబుతూ దేశాన్ని విముక్తం చేశాడా అని ఆయన అడిగారు. లాతూరు కరువు వచ్చినప్పుడు షిర్డీ సాయిబాబా ఏమీ చేయలేదని విమర్సించారు.

Swarupananda questions Shirdi saibaba devotees

షిర్డీ సాయిబాబాను పూజించినా కూడా మహిళలపై దాడులు ఆగడం లేదని చెప్పారు. దేశంలో మద్యపానం, డ్రగ్స్ అలవాటు పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అలవాటు నుంచి తాము యువతను రక్షిస్తున్నామని ఆయన చెప్పారు. సాయి రామాయణం, సాయి చాలీసా సృష్టించారని ఆయన చెప్పారు. సాయి భక్తుల నుంచి హిందూ మతాన్ని అప్రమత్తం చేస్తున్నామని స్పష్టం చేశారు.

షిర్డీ సాయిబాబా దేవుడే కాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మరోసారి అన్నారు. షిర్డీ సాయి భక్తులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. హైదరాబాదులోని షిర్డీ సాయిబాబా దేవాలయం వద్ద భక్తులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.

English summary
Dwaraka Peetham Swaraupananda once again criticised Shirdi sai baba devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X