• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్వాతినాయుడు కఠిన నిర్ణయం: బిడ్డను అనాధ ఆశ్రమంలో వేద్దామనుకున్నా.. ఎందుకంటే..

|

యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే తన భర్త అవినాష్‌తో గొడవలు జరుగుతున్నాయి వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో వదిలారు. అందులో తాను పాపను అనాధ ఆశ్రమంలో వేద్దామనుకున్నానని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో స్వాతి-అవినాష్‌ల మధ్య ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. అయితే స్వాతినాయుడు వీడియోలు నిజమేనా.. లేక వ్యుస్ కోసమా అనే సందేహం కూడా వస్తోంది. కానీ ప్రస్తుతానికైతే ఆ వీడియోలను నిజమైనవని నమ్మాల్సి వస్తోంది. పెళ్లైన తర్వాత విడుదల చేసిన రెండో వీడియో కూడా తెగ వైరలవుతోంది.

ప్రేమించిన అవినాషే..

ప్రేమించిన అవినాషే..

2019లో తనను ప్రేమించిన అవినాష్‌ని స్వాతినాయుడు పెళ్లి చేసుకుంది. వీరికి ఇటీవలే పాప జన్మించింది. ఆమెకు మూడు నెలల వయసు కాగా.. భార్య భర్తలకు గొడవలు జరుగుతున్నాయి. వీరి గొడవ మద్యం విషయంలోనే కావడం విశేషం. అవినాస్ తాగకుండా ఉండటం లేదు అని.. చిన్నారి తినడం స్టార్ట్ చేసేవరకు తాగొద్దని చెబుతోన్నా అని స్వాతినాయుడు నిట్టూర్చింది. కానీ అతను వినడం లేదు అని.. బేబీకి 3 నెలలు.. మరో 3 నెలలు ఆగు అని చెప్పిన వినిపించుకోవడం లేదన్నారు.

షూటింగ్స్ వస్తోన్నా..

షూటింగ్స్ వస్తోన్నా..

తనకు చాలా షూటింగ్ ఆఫర్స్ వస్తున్నాయని.. పబ్లిక్ టాక్ టీవీ, మంగతాయారు వంటల షోలు పెండింగ్‌లో ఉన్నాయని స్వాతినాయుడు వివరించారు. కరోనా వల్ల బయటకు వెళ్లలేకపోతున్నానని.. చిన్నారి కోసం ఆలోచిస్తున్నానని తెలిపారు. ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఉన్నా బయటకు వెళ్లడం లేవని వివరించారు. తన పేరంట్స్ డబ్బులు తీసుకొని వెళ్లిపోయారని.. భర్త వాళ్ల పేరంట్స్ మాట్లాడరని పేర్కొన్నారు. ప్రస్తుతం మేం ముగ్గురమే ఉన్నామని.. తాను షూటింగ్స్‌కి వెళితే పాపకు పాలు పట్టడం కూడా కుదరదని.. అలాగని షూటింగ్ వద్దకు తనను తీసుకెళ్లలేను అని చెప్పారు.

అనాధాశ్రమంలో వదిలేసి.. కలిసి మందుతాగుదాం...

అనాధాశ్రమంలో వదిలేసి.. కలిసి మందుతాగుదాం...

షూటింగ్ అంటే తాను డేర్ అయినా చేస్తానని.. కానీ కరోనా పూర్తిగా తగ్గిన తరువాతే వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు. అప్పటివరకూ ఉన్న వాటితోనే అడ్జెస్ట్ అవుదాం అని చెబుతున్నా తన భర్త వినిపించుకోవడం లేదన్నారు. భర్త చేసే పనుల వల్ల పసిదాన్ని తిట్టానని ఏడ్చేసింది. తనని తీసుకుని వెళ్లి అనాధ ఆశ్రమంలో వదిలేద్దాంమని.. అప్పుడు మనమిద్దరం తాగుతూ ఉండొచ్చని తెలిపింది. మొన్న జరిగిన గొడవలో బేబీ తలకు దెబ్బ తగిలిందని వాపోయింది. అంతకుముందు భర్తతో కలిసి మందు తాగేదాన్ని అని.. బేబీ కడుపులో పడిన తరువాత తాగడం మానేశా అని వివరించారు. తన గురించి కాకపోయినా పాప కోసం కూడా ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

భర్త అవినాష్త వేధింపులు అని..

భర్త అవినాష్త వేధింపులు అని..

ఇటీవల తన భర్త తనను వేధిస్తున్నాడని కూడా వీడియో వదిలిన సంగతి తెలిసిందే. అతనిని వదిలేస్తానని పేర్కొన్నది. తన భర్త వేధిస్తున్నాడని.. త్వరలోనే విడిపోతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఇటీవలే పాప పుట్టిందని.. కానీ చిన్నారి అనారోగ్యంగా ఉందని స్వాతినాయుడు తెలిపారు. కొత్త ఇళ్లు కడుతుండగా భర్త ఆ పనులు చూసుకుంటున్నాడని వివరించారు. లాక్ డౌన్ వల్ల తమకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని.. ఇటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అటు భర్త రోజు తాగడంతో విసిగిపోయానని చెప్పారు. రాత్రి కాగానే డ్రింక్ చేస్తున్నాడని.. అడిగితే రకరకాల అబద్దాలు చెబుతున్నాడని వాపోయింది.

ఆస్తి విషయంలో గొడవలు

ఆస్తి విషయంలో గొడవలు

పాపను చూడటం లేదు, చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటున్నాడని కన్నీటి పర్యంతమైంది. దీంతో అవినాష్‌ని పెళ్లి చేసుకొని తప్పు చేశానా అనే భావన వ్యక్తమవుతోందని నిట్టూర్చింది. తనే పెళ్లి చేసుకోవాలని అడిగాడని, ప్రేమ పేరుతో వంచించాడని పేర్కొన్నారు. తాగడం వల్ల ఇంత ఇబ్బంది ఉంటుందని తెలియలేదని.. కానీ అతను మాత్రం డ్రింక్ సర్వస్వం అంటున్నాడని తెలిపారు. మందు మానేయాలని కోరితే.. తనను, పాపను వదిలేస్తానని చెబుతున్నాడని పేర్కొన్నారు. ఆస్తి విషయంలో కూడా నాన్నతో గొడవలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. పాపకు పాలు ఇస్తోన్న సమయంలో కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడని వాపోయారు. తర్వాత మందు తెచ్చుకొని తాగితే.. తను కావాలా, మందు కావాలా అని అడిగితే మందే కావాలని చెప్పడంతో గొడవ జరిగిందని వివరించారు. తర్వాత మరో వీడియో విడుదల చేసింది స్వాతినాయుడు.

English summary
swathi naidu:left in my three months child in Orphanage swathi naidu said. husband avinash harassed me.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X