వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు జపాన్ టూర్‌తో ఏపీకి ఇన్వెస్టర్లు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఏప్రిల్ నెల 24న పెట్టుబడిదారులతో భారీ సమావేశం నిర్వహించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే రోజు ఇన్వెస్టుమెంట్ మిషన్ ప్రారంభిస్తామన్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమావేశం ఒక వేదిక అవుతుందన్నారు. ఆటోమొబైల్, దాని అనుంబంధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులతో పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన శాఖల ప్రతినిధుల భేటీ ఏర్పాటు చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమొబైల్ హబ్‌గా రూపొందించేందుకూ ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. టోక్యో కవాసాకీ యోకోహమా నగరాల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ నెల్లూరు - చెన్నై - తిరుపతి మధ్య ప్రాంతాన్ని ఆటోమొబైల్ , అనుబంధ రంగాలకు సంబంధించిన పాలసీ ప్రకటిస్తామన్నారు.

ఇసుజు ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ తకషి కుకుచి సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇసుజు సంస్థ చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీసిటీలో నెలకొల్పుతున్న మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనుల పురోగతిని వివరించారు. ఇసుజు సంస్థ 1500 కోట్లతో పికప్ ట్రిప్ తయారీ యూనిట్‌ను శ్రీసిటీలో నెలకోల్పుతోందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కర్మాగారం ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఇసుజు ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సిఎంకు వివరించారు.

చంద్రబాబుతో కికుచి

చంద్రబాబుతో కికుచి

జపాన్‌లో సీఎం జరిపిన సమావేశం ఫలితంగా దాదాపు 75కుపైగా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చెందిన విడిభాగాల తయారీదారులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఇసుజు ప్రతినిధి కికుచి తెలిపారు. ఆటో అనుబంధ రంగాల ప్రోత్సాహానికి ప్రభుత్వ తోడ్పాటు ఉండాలని కోరారు.

చంద్రబాబుతో కికుచి

చంద్రబాబుతో కికుచి

శ్రీసిటీలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, దాని అనుబంధ రంగాల యూనిట్ల స్థాపనకు అనువైన ప్రదేశాలను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఇసుజు శ్రీసిటీలో నెలకొల్పే కర్మాగారం ద్వారా 1500 నుండి 2000 వరకూ ఉద్యోగాలు స్థానికులకు కల్పించవచ్చునని సంస్థ ఎండీ చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సచివాలయంలో నీటి పారుదల పైన సమీక్ష నిర్వహించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సచివాలయంలో బార్ కౌన్సిల్ సభ్యులతో భేటీ అయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

సోమవారం నాడు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన వాగ్ కంపెనీ సభ్యులు. వారు రెండు లక్షల రూపాయల చెక్కు ఇచ్చారు.

English summary
T Kikuchi, President & MD, Isuzu Motors met Chandrababu Naidu, Hon’ble Chief Minister of AP, at Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X