విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై సుబ్బిరామిరెడ్డి ఆశలు, సీఎంను మోడీ చిక్కుల్లోకి నెడుతున్నారా?

|
Google Oneindia TeluguNews

విశాఖ: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం రైల్వే జోన్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి బుధవారం నాడు అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్పెషల్ ఎఫెక్ట్: హఠాత్తుగా ఢిల్లీకి బాబు, సుజన కొత్తగా 'ప్రత్యేక' ట్విస్ట్

రైల్వే జోన్‌ను విజయవాడకు తరలిస్తారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని చెప్పారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారని, ఆయనను సీఎం చంద్రబాబు ఒప్పిస్తారన్నారు. దీనిపై చంద్రబాబును తాము గట్టిగా కోరుతామన్నారు.

T Subbirami Reddy hopes on Chandrababu on Vishaka Railway zone

బాబును మోడీ చిక్కుల్లోకి నెట్టేనా?

విశాఖ రైల్వే జోన్ పైన చర్చ ఇప్పటిది కాదు. రైల్వే జోన్ ఇస్తామని బీజేపీ కూడా పలుమార్లు చెప్పింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఏపీ నుంచి ఎంపిక కావడం వెనుక గూడార్థం కూడా అదే అనే వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు రైల్వే జోన్‌ను విజయవాడకు ఇస్తారని వార్తలు రావడం గమనార్హం.

బాబు ఆగ్రహం-వెంకయ్య చక్రం, దిగొచ్చిన మోడీ: ప్యాకేజీ ఇలా!

అదే జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ లేదా బీజేపీ ఏపీ సీఎం చంద్రబాబును చిక్కుల్లోకి నెట్టినట్లే అంటున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాదు కేంద్రంగా అభివృద్ధి చేశారని, దీంతో ఇప్పుడు ఏపీలో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.

నవ్యాంధ్రలో ఆ పొరపాటు దొర్లవద్దని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పైనే దృష్టి సారించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు రైల్వే జోన్ కూడా విజయవాడకు అంటే చంద్రబాబును మోడీ చిక్కుల్లో పడేసినట్లే అంటున్నారు.

English summary
Congress MP T Subbirami Reddy hopes on Chandrababu on Vishaka Railway zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X